ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘన: జడ శ్రావణ్‌కుమార్‌

ABN, First Publish Date - 2023-06-03T21:16:19+05:30

రాష్ట్రంలో అత్యధికంగా మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ఇదే విషయాన్ని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయని జైభీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్రంలో అత్యధికంగా మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ఇదే విషయాన్ని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయని జైభీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ (Jada Shravankumar) తెలిపారు. విజయవాడలో అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటు ఆలస్యం చేస్తూ రాజకీయాల కోసం జగన్‌ ప్రభుత్వం పబ్బం గుడుపుకుంటుందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు పేరు పెట్టినప్పుడే కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మంత్రి ఇళ్లు వాళ్లే తగులబెట్టుకుని జనసేన కార్యకర్తలతో అల్లర్లు చెలరేగేలా చేశారని విమర్శించారు. అంబేడ్కర్‌ విగ్రహం పెట్టడంలో ఆలస్యం, కోనసీమ అల్లర్ల విషయంలో న్యాయం చేయడంలో విఫలమైన మంత్రులు విశ్వరూప్‌, మేరుగ నాగార్జున బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. దళిత బిడ్డలకు రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నా హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మానవ హక్కులు దారుణంగా ఉన్నాయని వస్తున్న రిపోర్టులపై హోంమంత్రి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఈ నెల 24న స్వరాజ్‌మైదానం నుంచి స్మృతివనం వరకు పాదయాత్ర చేపడతామని శ్రావణ్‌కుమార్ ప్రకటించారు.

Updated Date - 2023-06-03T21:16:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising