వైసీపీ కార్యాలయాలుగా వర్సిటీలు: ప్రణవ్‌గోపాల్
ABN, Publish Date - Dec 26 , 2023 | 03:01 AM
విశ్వవిద్యాలయాలను వైసీపీ కార్యాలయాలుగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్ విమర్శించారు.
విశాఖపట్నం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాలను వైసీపీ కార్యాలయాలుగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీలో ఎమ్మెల్యే, ఎంపీ సీటు కంటే వీసీ సీటును గిరాకీగా మార్చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వైస్ చాన్సలర్లు యూనివర్సిటీల నిధులను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు. కొంతమంది వీసీలకు క్యాంప్‌సలలో రాజకీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటుచేయడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడంపై లేదన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ప్రకారం 2019లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి దేశంలో 29వ ర్యాంకు వచ్చిందని, 2023లో 76వ ర్యాంకుకు ఇక్కడి పాలకులు దిగజార్చారని విమర్శించారు. ఈ ఏడాది దాదాపు 22 వేల మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం పొరుగు రాష్ట్రాలకు తరలిపోయారని ఆరోపించారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు చేయడంతోపాటు వేలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు ఉన్నత చదువుకు దూరమయ్యారన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 03:01 AM