ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉండవల్లి ‘స్కిల్‌’ పిటిషన్‌పై పత్రికాముఖంగా నోటీసులిస్తాం!

ABN, Publish Date - Dec 28 , 2023 | 04:01 AM

స్కిల్‌ కార్పొరేషన్‌ వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిల్‌కు సంబంధించి కొందరు ప్రతివాదులకు నోటీసులు ఇంకా చేరలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి హైకోర్టుకు తెలియజేశారు.

హైకోర్టు అనుమతి కోరిన సీనియర్‌ న్యాయవాది

అనుబంధ పిటిషన్‌ను పరిశీలించి ఉత్తర్వులిస్తామన్న ధర్మాసనం

అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): స్కిల్‌ కార్పొరేషన్‌ వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిల్‌కు సంబంధించి కొందరు ప్రతివాదులకు నోటీసులు ఇంకా చేరలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి హైకోర్టుకు తెలియజేశారు. నోటీసులు తీసుకునేందుకు కొందరు విముఖత చూపారని.. తలుపులకు తాళాలువేసి ఉన్న కారణంగా మరికొన్ని వెనక్కి వచ్చాయన్నారు. పత్రికాప్రకటన ద్వారా వీరికి నోటీసులు పంపించేందుకు అనుమతించాలని కోరారు. ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై బుధవారం కోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌ను పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయస్థానం పేర్కొంది. విచారణను వాయిదా వేస్తూ జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ మండవ కిరణ్మయితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది.

Updated Date - Dec 28 , 2023 | 04:01 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising