ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విజయనగరం జిల్లాలో రెండు ఆటోలు ఢీ

ABN, Publish Date - Dec 26 , 2023 | 03:00 AM

రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ చేయి తెగిపోయి రోడ్డు మీద పడింది. మరో వ్యక్తికి రెండు కాళ్లు విరిగిపోయాయి.

తెగిపడిన మహిళ చేయి

రేగిడి, డిసెంబరు 25: రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ చేయి తెగిపోయి రోడ్డు మీద పడింది. మరో వ్యక్తికి రెండు కాళ్లు విరిగిపోయాయి. ఈ ఘటన విజయనగరం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. రేగిడి మండలం బూరాడ గ్రామంలో సోమవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు ఆటోలు ఎదురెదురుగా వస్తున్నాయి. మృతదేహం వెంట వెళ్తున్న వారిని తప్పించబోయి రెండూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వావిలపల్లి కళ్యాణి అనే మహిళ చేయి తెగి రోడ్డుపై పడింది. ఈమె ఓ జూట్‌ పరిశ్రమలో దినసరి కూలీగా పనిచేస్తోంది. మరో వృద్ధుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వీరిద్దరిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మరో ఆరుగురికి గాయాలు కాగా వీరిని 108 వాహనంలో సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - Dec 26 , 2023 | 03:00 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising