సమర శంఖంతో వైసీపీలో వణుకు
ABN, Publish Date - Dec 22 , 2023 | 12:08 AM
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభలో మోగించిన సమర శంఖంతో జగన్ ప్రభుత్వానికి వణుకు పుట్టించిందని నంద్యాల టీడీపీ అసెంబ్లీ ఇన్‌చార్జి, పోలిట్ బ్యూరో సభ్యుడు ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
టీడీపీ - జనసేన ప్రభుత్వ ఏర్పాటు ఖాయం
నంద్యాల టీడీపీ అసెంబ్లీ ఇన్‌చార్జి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల (నూనెపల్లె), డిసెంబరు 21: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభలో మోగించిన సమర శంఖంతో జగన్ ప్రభుత్వానికి వణుకు పుట్టించిందని నంద్యాల టీడీపీ అసెంబ్లీ ఇన్‌చార్జి, పోలిట్ బ్యూరో సభ్యుడు ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ యువగళం ముగింపు విజయోత్సవ సభ అనుకున్నదానికంటే వందరెట్లు విజయవంతమైందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సాగిస్తున్న ఆరాచక, దౌర్జన్యకర పాలనపై ప్రజలు ఏ స్థాయిలో తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారో అన్న విషయం సభకు లక్షలాది మంది రాకతో స్పష్టమైందని పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం ఖాయమని అన్నారు. టీడీపీ - జనసేన పొత్తుకు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. లోకేశ్ యువగళం పాదయాత్ర చారిత్రాత్మకమని పేర్కొన్నారు. యువగళంపై సైకో ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. రాజ్యాంగ హక్కులను కూడా వైసీపీ ప్రభుత్వం కాలరాస్తూ రాక్షస ఆనందం పొందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చేయని తప్పుకు చంద్రబాబును జైలులో పెట్టించిన జగన్‌కు వచ్చే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. రాజధానిలేని రాష్ట్రంగా ఏపీని దిక్కులేని రాష్ట్రంగా మార్చిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. మరో రెండు నెలల్లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ఎన్‌ఎండీ ఫరూక్ స్పష్టం చేశారు.
‘అభ్యర్థుల మార్పుతో కొత్త నాటకాలు’
కల్లూరు : త్వరలో ఎదురు కాబోయే ఓటమిని ముందే ఊహిం చిన జగన్‌రెడ్డి అభ్యర్థుల మార్పు అంటూ కొత్త నాటకానికి తెరలేపుతు న్నారని, రాష్ట్ర ప్రజలంతా జగన్‌ను మార్చేపనిలో ఉన్నారని పాణ్యం, నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జులు గౌరుచరిత, గౌరు వెంకటరెడ్డి అన్నారు.
యువగళం ముగింపుసభ విజయవంతమైన నేపఽథ్యంలో గౌరు దంపతులు తమ స్వగృహంలో మాట్లాడారు. టీడీపీ, జనసేన మైత్రితో రాష్ట్రంలో పెనుమార్పు మొదలైందని, రానున్న ఎన్నికల్లో చంద్ర బాబు సీఎం కావడం తఽథ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలదొక్కుకోవాలంటే నారా చంద్రబాబునాయుడు సీఎం కావాలని స్పష్టం చేశారు.
Updated Date - Dec 22 , 2023 | 12:08 AM