ప్రజల రుణం తీర్చుకునేందుకే!
ABN, Publish Date - Dec 26 , 2023 | 02:57 AM
రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో తరిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు.
ప్రజాసేవలో తరిస్తున్నానన్న సీఎం జగన్
పులివెందుల చర్చిలో క్రిస్మస్ ప్రార్థనలు
కడప, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో తరిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. సోమవారం పులివెందులలోని సీఎ్‌సఐ చర్చిలో తల్లి విజయలక్ష్మి, భార్య భారతి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఎప్పటికీ మీ హృదయాల్లో ప్రియమైన నాయకుడిగా సుస్థిర స్థానాన్ని పొందగలనని ఆకాంక్షిస్తున్నా’ అన్నారు. ముఖ్యమంత్రిగా సొంతూరులో కుటుంబసభ్యులు, బంధువులందరితో కలిసి క్రిస్మస్ ప్రార్థనలు చేయడం ఆనందం గా ఉందన్నారు. ‘ఇలాగే మీ అందరి అభిమానం ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా పొందాలి’ అని ఆకాంక్షించారు. 2024 చర్చి క్యాలెండరును తల్లి విజయమ్మ తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పులివెందుల గాయత్రి కాలనీలో వైసీపీ నా యకుడు నల్లచెరువుపల్లె రవి ఇంటికి వెళ్లి వారి ఇంట్లో వధూవరులను ఆశీర్వదించారు. మధ్యాహ్నం హెలికాప్టర్‌లో మైదుకూరుకు వెళ్లి జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్ దస్తగిరి కొడుకు, ఇద్దరు కూతుర్ల వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. మైదుకూరు నుంచి హెలికాప్టర్‌లో కడప విమానాశ్రయం 1.05 గంటలకు చేరుకుని 1.30కు ప్రత్యేక విమానంలో గన్నవరం బయల్దేరారు. దీంతో సొంత జిల్లాలో సీఎం మూడురోజుల పర్యటన ముగిసింది. కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎంపీ అవినాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 02:58 AM