ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu : తుఫాన్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

ABN, First Publish Date - 2023-12-11T02:36:31+05:30

మిచౌంగ్‌ తుఫాన్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించి, మెరుగైన, తక్షణ సాయం చేసి, రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు

ఏపీకి తక్షణ సాయం చేయాలి.. ప్రధానికి చంద్రబాబు లేఖ

అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): మిచౌంగ్‌ తుఫాన్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించి, మెరుగైన, తక్షణ సాయం చేసి, రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘రాష్ట్రంలోని 15 జిల్లాల్లో తుఫాన్‌ ప్రభావం చూపింది. తుఫాన్‌ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలుచోట్ల పశువులు చనిపోయాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 22లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. తద్వారా రూ.10వేల కోట్ల వరకు పంట నష్టం ఉంటుందని అంచనా. పంట కోల్పోయిన బాధతో ఆరుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు ఆక్వా రంగం కూడా నష్టపోయింది. మత్స్యకార పడవులు, వలలకు నష్టం జరిగి, మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారు. తుఫాన్‌కు 770కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. తాగునీరు, నీటి పారుదల, విద్యుత్‌, కమ్యూనికేషన్‌ రంగాలకు నష్టం జరిగింది. ఈ తుఫాన్‌ ప్రభావం ఏపీతో పాటు పొరుగున తమిళనాడుపైనా చూపింది. తుఫాన్‌ తీవ్రత, నష్టం దృష్ట్యా జాతీయ విపత్తుగా ప్రకటించాలి’ అని చంద్రబాబు కోరారు. నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్రం నుంచి ఒక బృందాన్ని పంపాలి. జాతీయ విపత్తుగా ప్రకటిస్తే తక్షణ, మెరుగైన సహాయం బాధితులకు అందుతుంది. మీ ప్రకటన ద్వారా తుఫాన్‌ బాధితుల్లో విశ్వాసాన్ని నింపే అవకాశం ఏర్పడుతుంది’ అని లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2023-12-11T02:36:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising