ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అవును.. కోచ్‌ల కొరత వాస్తవమే..!

ABN, First Publish Date - 2023-12-11T01:18:05+05:30

శాప్‌లో రెగ్యులర్‌ ప్రాతిపదికన ఐదుగురు కోచ్‌లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని, మిగిలిన వారినంతా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై శాప్‌ వివరణ

అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): శాప్‌లో రెగ్యులర్‌ ప్రాతిపదికన ఐదుగురు కోచ్‌లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని, మిగిలిన వారినంతా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో నియమించుకున్నామని శాప్‌ పరిపాలనాధికారి పి.రామకృష్ణ తెలిపారు. ‘ఐ ప్యాక్‌తో ఆడుదాం ఆంధ్ర’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ప్రచురితమైన కథనంపై శాప్‌ అధికారులు వివరణ ఇచ్చారు. శాప్‌లో కోచ్‌ల కొరత ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించారు. మొత్తం 624 మంది కోచ్‌లు అవసరం ఉండగా ప్రస్తుతం 224మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. వారిలో రెగ్యులర్‌ కోచ్‌లు ఐదుగురే ఉన్నారన్నారు. కాంట్రాక్ట్‌ పద్ధతిలో 50 మంది, ఔట్‌సోర్సింగ్‌ కింద 93 మంది, పే అండ్‌ ప్లే కింద 51 మంది, ఖేలో ఇండియా కింద మరో 25 మంది కోచ్‌లున్నారు. ఆడుదాం ఆంధ్రా సోషల్‌ మీడియా ప్రచారానికి చెన్నై కంపెనీని ఎంపిక చేసినట్టు కూడా అధికారులు అంగీకరించారు. ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ విధానం ద్వారా ఈ ఎంపిక జరిగిందని చెప్పారు. అయితే చెన్నై కంపెనీతో ఎన్ని కోట్లకు ఒప్పందం చేసుకున్నారు.., దాని వెనుక ఎవరున్నారు..? అనే వివరాలను మాత్రం బయటపెట్టలేదు.

Updated Date - 2023-12-11T01:18:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising