ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కొనకొండ్లకు ఏం చేశావో చెప్పు?

ABN, First Publish Date - 2023-11-10T04:20:14+05:30

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవర్గంలో వైసీపీ వర్గపోరు రచ్చకెక్కింది. వజ్రకరూరు మండలం కొనకొండ్లలో గురువారం ‘గడపగడపకు’ కార్యక్రమం

మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని నిలదీసిన శివరామిరెడ్డి వర్గం

ఉరవకొండ, నవంబరు 9: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవర్గంలో వైసీపీ వర్గపోరు రచ్చకెక్కింది. వజ్రకరూరు మండలం కొనకొండ్లలో గురువారం ‘గడపగడపకు’ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ తలారి రంగయ్యతో కలిసి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి స్వగ్రామం కావడంతో పోలీసులను భారీగా మోహరించారు. విశ్వేశ్వరరెడ్డి గ్రామానికి చేరుకోగానే ఎమ్మెల్సీ వర్గీయులు, గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. స్థానికేతరులను గ్రామంలోకి ఎలా తీసుకొస్తారని నిలదీశారు. దళితులకు, వాల్మీకులకు గొడవ పెట్టి, అక్రమంగా కేసుల్లో ఇరికించారని వాల్మీకి సంఘం నాయకులు మండిపడ్డారు. విశ్వ గో బ్యాక్‌ అంటూ ఎమ్మెల్సీ వర్గీయులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. గ్రామానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఎమ్మెల్సీ వర్గీయులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. వాల్మీకి యువజన నాయకుడు చుక్కా రాజును పోలీ్‌సస్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించగా.. ఆయన బంధువులు, గ్రామస్థులు పోలీసు జీపును అడ్డుకున్నారు. దీంతో రాజును పోలీసులు కిందకు దించారు.

Updated Date - 2023-11-10T04:20:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising