ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులతో నేడు చర్చలు

ABN, Publish Date - Dec 28 , 2023 | 03:58 AM

ఆరోగ్యశ్రీ సేవలు ఈ నెల 29 నుంచి నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఇచ్చిన నోటీసులపై ప్రభుత్వం స్పందించింది.

అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ సేవలు ఈ నెల 29 నుంచి నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఇచ్చిన నోటీసులపై ప్రభుత్వం స్పందించింది. గురువారం ఉదయం చర్చలకు రావాలని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ను కోరారు. ఈ చర్చల నేపథ్యంలో ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో మంగళగిరిలో సమావేశం నిర్వహించారు. బకాయిల విడుదలపై ఏం చేద్దామని చర్చించినట్లు తెలుస్తోంది. గురువారంనాటి సమావేశానికి ఆర్థిక శాఖ అధికారులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కాలేజీలు కూడా ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈమేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుకు లేఖ అందించారు. గురువారం జరిగే చర్చల్లో ఈ అసోసియేషన్‌ కూడా పాల్గొనే అవకాశం ఉంది.

Updated Date - Dec 28 , 2023 | 03:58 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising