జనసేనలో చేరిన వైసీపీ సర్పంచ్
ABN, First Publish Date - 2023-12-11T00:12:07+05:30
మెళియాపుట్టి మండలం గోకర్ణపురం వైసీపీ సర్పంచ్ సేనాపతి రవి కుమార్ ఆదివారం జన సేన పార్టీలో చేరారు. శ్రీకాకుళంలో ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆయనకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.
మెళియాపుట్టి: మెళియాపుట్టి మండలం గోకర్ణపురం వైసీపీ సర్పంచ్ సేనాపతి రవి కుమార్ ఆదివారం జన సేన పార్టీలో చేరారు. శ్రీకాకుళంలో ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆయనకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి గ్రామానికి బ్రిడ్జి నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయకపోవడంపై అసంతృప్తితో ఉన్న రవి కుమార్ వైసీపీలో ఉంటే న్యాయం జరగదని గుర్తించి జనసేనలో చేరినట్లు తెలిపారు. జలగలింగుపురం సమీపంలోని పడ్డ రెవెన్యూ గ్రూపులో గ్రానైట్ లీజుతో ప్రజల ఇబ్బందులను నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి గేదెల చైతన్య, నాయ కుడు దుక్క బాలరాజు నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకు వెళ్లారు. ప్రజల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులను వైసీపీ తీసుకువస్తే జనసేన ప్రజల తరుపున పోరాడుతుందని ఆయన హామీ ఇచ్చారు.
ఫ ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు. శ్రీకాకుళంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు ఆధ్వర్యంలో వారికి పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ కండువాలు వేసి ఆహ్వా నించారు. వైసీపీ నుంచి జనసేనలో చేరిన వారిలో మున్సిపాలిటీ 1, 2, 13, 17 వార్డు కార్యకర్తలు చేరారు. అలాగే మండపల్లి, సోంపేట మండలం చేపల గొల్లగండి గ్రామానికి వైసీపీ కార్యకర్తలు గండుపల్లి మిన్నరావు, గండుపల్లి జగదీశ్వరరావు, కర్రి నాగరాజు, తుపాకుల ఖగేష్, ఆశి శేషారావు, చాట్ల శేషారావు, కొనతాల త్రినాథ్‌రెడ్డి, కాతిలి వాసు, పైల శ్రీను, అనపాన రమేష్, లండ రుక్మంగద్, నీలాపు ఉపేంద్ర, కొరికాన ఫకీర్ తదితరులున్నారు.
రణస్థలం: జీఆర్ పురం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు సీహెచ్ పున్నమి, సుంకరి రమణ, జిస్వప్న, పిట్ట శ్రీను తదితరులు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కాగా జిల్లా ముఖద్వారం పైడిభీమవరం వద్ద నియోజకవర్గం పార్టీ కన్వీనర్ విష్వక్సేన్ ఆధ్వర్యంలో బసవ గోవిందరెడ్డి, వడ్డాది శ్రీనివాసరావు తదతరులు మనోహర్‌కు ఘనంగా స్వాగతం పలికారు.
కార్యకర్త కుటుంబానికి పరిహారం
పొందూరు: విద్యుత్‌ఘాతంతో ఐదు నెలల కిందట మృతి చెందిన మండల కేంద్రానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త గొర్లె వసంత్‌కుమార్ కుటుంబానికి ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రూ.5 లక్షల పరిహారం చెక్కును ఆదివారం అందించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్, ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌చార్జి పేడాడ రామ్మోహన్, పార్టీ మండల అధ్యక్షుడు ఎలకల రమణ, నాయకులు పాత్రుని పాపారావు, పైడి మురళీమోహన్, సూర్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-11T00:12:09+05:30 IST