ఐక్యంగా పనిచేయండి
ABN, First Publish Date - 2023-11-10T23:25:29+05:30
నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు.శుక్రవారం జి.సిగడాం, హిరమండలం మండలాల క్లస్టర్,బూత్ ఇన్‌చార్జిలు, నాయకులతో ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు సమావేశం నిర్వహించారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు.
నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు.శుక్రవారం జి.సిగడాం, హిరమండలం మండలాల క్లస్టర్,బూత్ ఇన్‌చార్జిలు, నాయకులతో ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు సమావేశం నిర్వహించారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు.
ప్రణాళికలు సిద్ధంచేసుకోవాలి
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకటరావు
జి.సిగడాం: పార్టీ గెలుపుకోసం నాయకులు సైనికుల్లా పనిచేయాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు కోరారు. శుక్రవారం టీడీపీ క్యాంపు కార్యాలయంలో మండలంలోని నాయకులతో విస్తృత స్థాయి సమావేశంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు ఎంతో సమయంలేదని, ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.పార్టీ గెలుపుకోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని భరోసాఇచ్చారు.సమావేశంలో నాయకులు కుమరాపు రవికుమా ర్, టంకాల మౌళీశ్వరరావు, కుదిరెళ్ల బుజ్జి, ఆరెళ్లగొళ్లాజి, కూనుబిల్లి కూర్మా రావు, రామకృష్ణంనాయుడు, కంచరాన సూరన్నాయుడు, మహ దాశ్యం చిన్నా రావు, భూపతి బుజ్జి, విక్రం కాశిబాబు, గొక మహేష్, డి.నారాయణరావు, కె.సాయికుమార్, పి.బంగారినాయుడు, పి.శ్యామ్ పాల్గొన్నారు.
ఏమి చేశారని జగన్ అవసరం
ఫ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ
హిరమండలం: ఆంధ్రప్రదేశ్‌కు ఏమిచేశారని జగన్ అవసరముందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ప్రశ్నించారు.శుక్రవారం హిరమం డలంలో క్లస్టర్,బూత్ ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.వైసీపీప్రభుత్వ రాక్షసపాలనతో విసిగెత్తిన ప్రజ లు ఐహేట్ జగన్ అంటున్నారని, దీంతో రానున్న ఎన్నికల్లో ఓటమి తప్ప దని తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందు కు కావాలనంటే పేరుతో భారీఎత్తున ప్రజలసొమ్ముతో ప్రభుత్వానికి డబ్బాకొట్టే ప్రచార కార్యక్రమం చేపడుతున్నారని ఆరోపించారు. పాతప ట్నం నియోజకవర్గంలో వంశధార నిర్వాసితులకు 2013 చట్టం అమలు చేస్తామని మాట తప్పినందుకా జగన్‌మోహన్ రెడ్డి అవసరమని ప్రశ్నిం చారు.ఈ విషయంపై ఎమ్మెల్యే రెడ్డిశాంతి సమాధానం చెప్పాలన్నారు. సచివాలయంలో వైసీపీ జెండాను ఎగురవేయడంపై ప్రశ్నించారు. ఇందుకు సహకరించిన అధికారులపై ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. జగన్ మోహన్ రెడ్డికి ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందన్నారు. ప్రభు త్వం సొమ్ముతో పార్టీ కోసం ఎన్నికల ప్రచారం చేయడం దారుణమ న్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక పార్టీకి,ప్రభుత్వానికి తేడా లేకుండా చేశారని కలమట ఆరోపించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు పి.బుచ్చి బాబు, టీడీపీ మండలాధ్యక్షుడు చెట్టు శ్రీను, కె.సింహాచలం, ఎస్.గోవింద, బర్రి సురేష్,దారపు ఢిల్లేశ్వరరావు పాల్గొన్నారు.
జగన్ వల్ల రాష్ట్రం అధోగతిపాలు
ఫమాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
జలుమూరు (సారవకోట): టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని, జగన్ వల్ల రాష్ట్రం అధోగతిపాలయ్యిందని నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శుక్రవారం సారవకోట మండలంలోని సవరడ్డపనసలో విలేకరులతో మాట్లాడారు. నాలుగున్నరేళ్ల పాలనలో నిత్యావసర సరుకులతో పాటు గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజానీకం నడ్డివిరచడంతో వైసీపీప్రభుత్వాన్ని ప్రజానీకం అసహించుకుంటు న్నారని తెలిపారు. స్మార్ట్ మీటర్లు పేరుతో 15వేలు కోట్లు దోచుకొని తాడేపల్లి పాలెస్‌కు కమీషన్ల పేరుతో కప్పం రూపేణ తరలించారని ఆరోపించారు. వైసీపీ నాయకులు మాటలు ప్రజలు వినే పరిస్థితిలో లేకపోవడంతో జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని నిర్వహించి అధికారులతో పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర బీసీ కమిటీ అధికార ప్రతినిధి ధర్మాన తేజకుమార్, పార్టీ మండలాధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, నాయకులు సురవరపు తిరుపతిరావు, పిళ్లా నందకిశోర్, కోన వెంకటేష్, చీడి వెంకటరమణ, పొన్నాన శంకరరావు, నిక్కు జనార్దనరావు, కొర్ను హేమంత్, దువ్వారపు జయరాం, యుగంధర్, రామారావు పాల్గొన్నారు.
నవరత్రాల పేరుతో మోసాలు
ఫటీడీపీ టెక్కలి మండలాధ్యక్షుడు బగాది శేషగిరి
టెక్కలి: రాష్ట్ర ప్రభుత్వం నవరత్రాలు పేరుతో నవమోసాలు చేస్తోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీమైనార్టీ సబ్‌ప్లాన్ నిధులు దారిమళ్లించిందని టీడీపీ టెక్కలి మండలాధ్యక్షుడు బగాది శేషగిరి ఆరోపించారు.తన దోపిడీని ఎదుటివారికి అంటగట్టి చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నైజమని విమర్శించారు.శుక్రవారం టెక్కలిలో విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 120 సంక్షేమ పథకాలను రద్దుచేసిన ఘనత జగన్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కిందన్నారు. రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీపై మాటతప్పారని, ప్రత్యేక హోదాపై మడమతిప్పారని, భూకబ్జాలకోసం విశా ఖపై అధికార పార్టీ నాయకులు వాలుతున్నారని ఆరోపించారు. సమావేశం లో మళ్ల బాలకృష్ణ, హనుమంతు రామకృష్ణ, మెండ దమయంతి, దల్లి ప్రసాద్‌రెడ్డి, షణ్ముఖరావు, ప్రపుల్లా, దుర్గారావు, ప్రీతీష్ పాల్గొన్నారు.
Updated Date - 2023-11-10T23:25:31+05:30 IST