ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

ABN, First Publish Date - 2023-12-11T00:19:31+05:30

పలాస రైల్వే స్టేషన్‌కు కిలోమీటరు దూరంలో ఆదివారం సాయంత్రం భువనేశ్వర్‌ వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి 33 ఏళ్ల వయస్సు కలిగిన మహిళ ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే ఎస్‌ఐ తెలిపారు.

పలాస: పలాస రైల్వే స్టేషన్‌కు కిలోమీటరు దూరంలో ఆదివారం సాయంత్రం భువనేశ్వర్‌ వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి 33 ఏళ్ల వయస్సు కలిగిన మహిళ ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే ఎస్‌ఐ తెలిపారు. ఈమె వద్ద ఉన్న గుర్తింపు కార్డు ప్రకారం రాణికుమారిగా అనుమానిస్తున్నారు. డిఫెన్స్‌ ఉద్యోగిని భార్యగా గుర్తింపు కార్డు ఉందని, మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు. రైలు ఢీకొ నడంతో ఆమె శరీరం ఛిద్రమైందని, నుదుటి భాగం పూర్తిగా దెబ్బతినగా, చేతులు నుజ్జయ్యాయి. ఈమె వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

వివాహిత ఆత్మహత్యాయత్నం

టెక్కలి రూరల్‌: సన్యాసినీలాపురం గ్రామానికి చెందిన వివాహిత రంగం అరుణ ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. అరుణకు గ్రామానికి చెందిన ధర్మారావుతో రెండేళ్ల కిందట వివాహం కాగా తరచూ వారిమధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె క్షణికావేశానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వెంటనే కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణ తెలిపారు.

Updated Date - 2023-12-11T00:19:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising