ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉత్తరాంధ్రకు ఒరగబెట్టిందేమిటి జగన్‌?

ABN, First Publish Date - 2023-12-11T00:19:07+05:30

ఉత్తరాంధ్ర జిల్లాలకు నాలుగేళ్లుగా నీవు ఒరగబెట్టిందేమిటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఆది వారం సాయంత్రం టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ విశాఖపట్నం రైల్వే జోన్‌ అని అయితే అది ఇప్పటికీ కార్యరూపం దాల్చ లేదన్నారు.

అచ్చెన్నాయుడును కలిసిన టెక్కలి వైశ్యసంఘ ప్రతినిధులు

కోటబొమ్మాళి: ఉత్తరాంధ్ర జిల్లాలకు నాలుగేళ్లుగా నీవు ఒరగబెట్టిందేమిటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఆది వారం సాయంత్రం టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ విశాఖపట్నం రైల్వే జోన్‌ అని అయితే అది ఇప్పటికీ కార్యరూపం దాల్చ లేదన్నారు. ఎక్కువ ఆదాయం వచ్చే ఈ జోన్‌పై నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇది విభజన చట్టంలో ఉన్నప్పటికీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం పై ఒత్తిడి తీసుకువచ్చామన్నారు. అదే సమయంలో ప్రభు త్వం మారడంతో నిలిచిపోయిందన్నారు. సీఎం జగన్‌ కేంద్రా నికి అనుకూలంగా ఉన్నప్పటికీ రైల్వే జోన్‌ కోసం కనీసం ప్రయత్నించకపోవడం దురదృష్టకరమన్నారు. జోన్‌ కోసం స్థలం కేటాయించకపోవడం వల్లే ఇవ్వలేకపోతున్నా మని కేంద్రం పేర్కొందన్నారు. దీనిపై సీఎం జగన్‌ సమాధానం ఇవ్వాలన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కులాలు, వర్గాల మధ్య విభేదాలు సృష్టించేందుకే మూడు రాజధా నులకు ప్రయత్నిస్తూ.. ఎక్కడా రాజధాని లేకుండా చేశారని ఆరోపించారు. కింజరాపు హరివరప్రసాద్‌, బోయిన రమేష్‌, వెలమల విజయలక్ష్మి, తర్రా రామ కృష్ణ పాల్గొన్నారు.
రానున్నది టీడీపీ ప్రభుత్వమే..
టెక్కలి:
రానున్నది టీడీపీ ప్రభుత్వమని, సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం జరుగుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో టెక్కలి వైశ్య సంఘ ప్రతినిధులతో ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్కలి పట్టణాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, వైశ్య కులస్థులంతా టీడీపీని ఆదరించాలని కోరారు. పలువురు వైశ్యసంఘం ప్రతినిధులు టెక్కలి పట్ట ణానికి సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు బెలిసెంటి నర్సింహమూర్తి, మధు, నగేష్‌, తంగుడు రమణ మూర్తి, సుధ, తిరుమలరావు, మాజీ వైశ్యసంఘ అధ్యక్షుడు లాడి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T00:19:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising