ట్రక్ షీట్లు రాక..!
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:56 PM
మండలంలో పలు రైతుభరోసా కేంద్రాల పరిధిలో పండించిన ధాన్యానికి ట్రక్ షీట్లు రాకపోవడంతో వాహనాలతో మిల్లుల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారు.
మిల్లుల వద్ద రైతుల పడిగాపులు
నందిగాం: మండలంలో పలు రైతుభరోసా కేంద్రాల పరిధిలో పండించిన ధాన్యానికి ట్రక్ షీట్లు రాకపోవడంతో వాహనాలతో మిల్లుల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారు. బ్యాంక్ లకు వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, మిల్లర్ల బ్యాంక్ గ్యారెంటీ గడువు ముగి యడంతో ట్రక్ షీట్ల జారీలో జాప్యంతో పాటు నెట్ సేవలు కూడా సహకరించక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై వ్యవసాయాధికారి పి.శ్రీకాంత్‌వర్మను ప్రశ్నించగా ట్రక్ షీట్ల జనరేషన్‌కు నెట్ అందకపోవడంతో సమస్య నెల కొందని, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 11:56 PM