ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కంటైనర్‌ను ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

ABN, Publish Date - Dec 24 , 2023 | 11:35 PM

పురుషోత్తపురం పాత చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఆగివున్న కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది.

నుజ్జయిన బస్సు

- బస్సు డ్రైవర్‌, క్లీనర్‌, ప్రయాణికుడికి తీవ్ర గాయాలు

ఇచ్ఛాపురం: పురుషోత్తపురం పాత చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఆగివున్న కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు ఒక ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.45గంటల సమయం లో భువనేశ్వర్‌ నుంచి వైజాగ్‌కు వెళ్తున్న శ్రీకీర్తన సాయి ట్రావెల్స్‌ బస్సు పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద ఆగిఉన్న కంటైనర్‌ను అతి వేగంగా ఢీకొ ట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జు అ యింది. అలాగే, కంటైనర్‌ రోడ్డుపక్కన ఉన్న చెక్‌ పోస్టుపైకి దూసుకెళ్లడంతో అది ధ్వంసమయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ మొగల కిరణ్‌, క్లీనర్‌ బిహార్‌కు చెందిన గిరేంద్రకుమార్‌ సాహు, బస్సు ముందు సీటులో కూర్చున్న విశాఖపట్నంకు చెందిన మద్దిల వాసుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ కె.గోవిందరావు తెలిపారు.

Updated Date - Dec 24 , 2023 | 11:35 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising