ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మా గోడు వినరు.. చూడరు.. పట్టించుకోరు

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:01 AM

రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ నాయకులు, అధికారులు ‘మా గోడు వినరు.. చూడరు.. పట్టించుకోరు’ అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీకాకుళం : కళ్లు, చెవులు, నోరు మూసుకుని అంగన్‌వాడీ కార్యకర్తల నిరసన

- కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె

- రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వినూత్న నిరసన

- నేడు ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నా

అరసవల్లి, డిసెంబరు 17: రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ నాయకులు, అధికారులు ‘మా గోడు వినరు.. చూడరు.. పట్టించుకోరు’ అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ కళ్లు, చెవులు, నోరు మూసుకుని వినూత్న నిరసన తెలిపారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఆదివారం శ్రీకాకుళం అర్బన్‌ ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ గోడు పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్రాల తాళాలు పగులగొట్టడం.. చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఇప్పటికైనా బెదిరింపులు మానుకుని.. సమస్యలను పరిష్కరించాలని, హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కె.కల్యాణి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం ఆర్డీవో కార్యాలయాల వద్ద చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ నాయకులు టి.రాజేశ్వరి, కె.ప్రమీలాదేవి, ఈ.అప్పలనరసమ్మ, జి.రాజేశ్వరి, కృష్ణభారతి, సుశీల, మల్లేశ్వరి, రోజా, లక్ష్మి, ఎన్‌.పార్వతి, చిట్టితల్లి, ఎం.నాగపద్మ, ఎస్‌.దమయంతి పాల్గొన్నారు.

అంగన్‌వాడీలు చేసిన తప్పేంటి?: అచ్చెన్నాయుడు

టెక్కలి: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లపై సీఎం జగన్మోహన్‌రెడ్డి ఉక్కుపాదం మోపడం నిరంకుశ పాలనకు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తుతూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అంగన్‌వాడీలు చేసిన తప్పేమిటి?. అక్రమ అరెస్టులు, నిర్భందాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. అంగన్‌వాడీ కేంద్రాలు తాళాలు పగులగొట్టే అధికారం ఎవరిచ్చారు. జగన్‌ నడుపుతున్నది ప్రభుత్వమా? లేదా ప్రైవేటు సైన్యమా?’ అని అచ్చెన్న ప్రశ్నించారు. ‘టీడీపీ హయాంలో అంగన్‌వాడీలకు చేయూతనిచ్చాం. రూ.4,200 నుంచి రూ.10,500కు వేతనాలు పెంచాం. కొన్నిచోట్ల కేంద్రాలు నిర్మించాం. మరికొన్నిచోట్ల ఆధునికీకరించాం. మనోవికాస కేంద్రాలుగా అంగన్‌వాడీలు పనిచేశాయి. నేడు జగన్‌ అసమర ్థ పాలనలో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. అంగన్‌వాడీలకు కనీస వేతనాలు లేవు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదు. ప్రభుత్వం స్పందించి న్యాయమైన వారి డిమాండ్లను పరిష్కరించాలి. ఇచ్చిన హామీలను అమలు చేయాల’ని అచ్చెన్న డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు తాము అండగా ఉంటామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Updated Date - Dec 18 , 2023 | 12:01 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising