ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు

ABN, First Publish Date - 2023-12-04T00:21:46+05:30

పరిపాలనాధక్షుడు, విజన్‌ కలిగిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును గెలిపించి రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని టీడీపీ మండలాధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ కోరారు.

సరుబుజ్జిలి: బసవ మామిడివలస గిరిజన గ్రామంలో పర్యటిస్తున్న టీడీపీ నాయకులు

జలుమూరు (సారవకోట): పరిపాలనాధక్షుడు, విజన్‌ కలిగిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును గెలిపించి రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని టీడీపీ మండలాధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ కోరారు. ఆదివారం సారవకోట మండలంలోని కుమ్మరిగుంట, అలుదు, బుడితి గ్రామాల్లో బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిన్నాల మాధవరావు, జంగం మురళీకృష్ణ, కుంచి రాము, జనార్దన, నాగరాజు, డి.వెంకటసూర్యనారాయణ, రావాడ కృష్ణ పాల్గొన్నారు.

- సరుబుజ్జిలి: చిగురువలస పంచాయతీ బసవ మామిడివలస గిరిజన గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకులు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ గుర్రాల చిన్నబాబు, మండల టీడీపీ నాయకులు కొర్ణు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ష్యూరిటీ పత్రాలు పంపిణీ చేసి, వైసీపీ వైఫల్యాలను వివరించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

- సోంపేట: శాసనాం పంచాయతీలో ఆదివారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సూరాడ చంద్రమోహన్‌, వెదుళ్ల హరికృష్ణ, బంగారు జోగారావు, ఆనందరావు, తమ్మినేని సంతోష్‌ తదితరులు ఉన్నారు.

- జి.సిగడాం: రాష్ట్రంలో రానున్నది రామరాజ్యమేనని, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని టీడీపీ మండల అధ్యక్షుడు కుమరాపు రవికుమార్‌ అన్నారు. ఆదివారం మెట్టవలస, నిద్దాం, వాండ్రంగి, డీఆర్‌ వలస, ఎందువ తదితర గ్రామాల్లో బాబూ ష్యూరిటీ- భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న అవినీతి పాలనపై ప్రజలు విసుగు చెందారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొల్లాజీ, బగాది అప్పలనాయుడు, జి.శ్రీనివాసరావు, అల్లు జోగినాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-04T00:21:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising