ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భయం గొల్పిన పోర్టు వాహనం

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:08 AM

తెంబూరు రోడ్డులో ఆదివారం సాయంత్రం మూలపేట పోర్టు వాహనం వెను టైర్‌ ఊడిపోయి కొంతదూరం వెళ్లి ఆగిఉన్న కారుకు తగలడంతో దెబ్బతింది.

పోర్టు వాహనం టైరు ఢీకొని దెబ్బతిన్న కారు.. పక్కనే పడిన టైరు

- కంటైనర్‌ టైరు ఊడి దెబ్బతిన్న కారు

- త్రుటిలో తప్పిన ప్రమాదం

టెక్కలి రూరల్‌: తెంబూరు రోడ్డులో ఆదివారం సాయంత్రం మూలపేట పోర్టు వాహనం వెను టైర్‌ ఊడిపోయి కొంతదూరం వెళ్లి ఆగిఉన్న కారుకు తగలడంతో దెబ్బతింది. అయితే పోర్టుకు సంబంధిం చిన భారీ కంటైనర్‌ టైరు ఊడి పోయి అతివేగంగా వచ్చిన సమయంలో అటుగా స్థాని కులు, ద్విచక్ర వాహన దారులు, పాదచారులు లేకపోవడంతో త్రుటిలో పెనుప్రమాదం తప్పింద ని స్థానికులు తెలిపారు. ఇటీవల డీఎస్పీ డి.బాలచం ద్రారెడ్డి పోర్టు ట్రాన్స్‌పోర్టు వాహ నదారులతో సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరించినా ఫలితం కనిపిం చడం లేదన్న వాదనలొస్తున్నాయి. అతివేగంగా దూసుకు వచ్చిన లారీ కంటైనర్‌ టైరు ఎవరికైనా తగిలి ఉంటే ప్రాణాల మీదకు వచ్చి ఉండేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైన నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాల్లో తిరుగుతున్న పోర్టు వాహనాల ఫిట్‌నెస్‌పై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరు తున్నారు. దీనిపై ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణను వివరణ కోరగా ఈ ఘటనపై ఎటువంటి సమాచారం లేదని, పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:08 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising