ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తుఫాన్‌.. టెన్షన్‌

ABN, First Publish Date - 2023-12-04T00:26:11+05:30

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అన్నదాతల్లో అలజడి కొనసాగుతోంది. మిచౌంగ్‌ తుఫాన్‌ ముప్పు భయం వెంటాడు తోంది. తుఫాన్‌ ప్రభావంతో సోమవారం నుంచి మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటిం చింది.

ఇచ్ఛాపురం రూరల్‌ : డొంకూరు వద్ద హడావుడిగా నూర్పులు చేస్తున్న రైతులు

- నేటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు

- అన్నదాతల్లో అలజడి

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/ఇచ్ఛాపురం రూరల్‌/ నరసన్నపేట/వజ్రపుకొత్తూరు/ జి.సిగడాం)

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అన్నదాతల్లో అలజడి కొనసాగుతోంది. మిచౌంగ్‌ తుఫాన్‌ ముప్పు భయం వెంటాడు తోంది. తుఫాన్‌ ప్రభావంతో సోమవారం నుంచి మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటిం చింది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, ఈదురుగాలుల ప్రభావం చూపుతాయని వెల్లడించింది. ఈ క్రమంలో ఆదివారం జిల్లావ్యాప్తంగా మబ్బులు కమ్ముకున్నాయి. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, గార, పోలాకి, ఎచ్చెర్ల, రణస్థలం, నరసన్నపేట మండలాల్లో ఈదురుగాలులు బలంగా వీచాయి. అలాగే కళింగపట్టణం, బందరువానిపేట, కళ్లేపల్లి, బారువ, శివసాగర్‌ తీరం వద్ద సముద్రం కొన్ని అడుగులు ముందుకువచ్చింది. ఉవ్వెత్తున కెరటాలు ఎగిసిపడుతున్నాయి. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శివసాగర్‌ బీచ్‌ లో పిక్నిక్‌ వచ్చే పర్యాటకులను.. సముద్ర స్నానాలకు పోలీసులు అను మతించలేదు. కాగా.. వరిపంట చేతికందే దశలో వర్షాలు కురిస్తే తమకు నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరిపంటను కాపాడు కునే పనిలో నిమగ్నమయ్యారు. కొంతమంది యంత్రాలతో నూర్పులు చేపట్టి.. ధాన్యాన్ని భద్రపరిచారు. మరికొంతమంది వరికుప్పలపై పరదాలు కప్పారు. నరసన్నపేట మండలంలో మాకివలస, సుందరాపురం, పారశెల్లి, తోటాడ, బాలసీమ, కోమర్తి, కిల్లాం, మాకివలస, జమ్ము, తామరాపల్లి, కంబ కాయి తదితర గ్రామాల్లో వరికోతలు పూర్తిచేశారు. వాటిని కళ్లాల్లో భద్రపరి చారు. ఇచ్ఛాపురం మండలం డొంకూరు వద్ద తీరంలో అలలు ఉధృతి పెరగడంతో మత్స్యకారులు అప్రమత్తమయ్యారు. బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాల్లో భద్రపరిచారు.

నేడు స్పందన రద్దు

తుఫాన్‌ నేపథ్యంలో సోమ వారం నిర్వహించాల్సిన ‘స్పందన’ కార్యక్రమం రద్దు చేసినట్టు కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులంతా అప్రమ త్తంగా ఉండాలని ఆదేశించారు. అతి భారీవర్షాలు కురుస్తాయని.. సెలవుపెట్ట కుండా కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని.. విపత్తుల వేళ వెంటనే స్పం దించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. అలాగే జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిం చాల్సిన పోలీసు స్పందన రద్దు చేస్తున్నట్టు ఎస్పీ జీఆర్‌ రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గుర్తించాలని కోరారు.

Updated Date - 2023-12-04T00:26:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising