ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సంఘటిత పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:59 PM

సంఘటిత పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతా యని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు సింహాద్రి ధనుంజయరావు అన్నారు. చల్లవానిపేట సబ్‌స్టేషను సమీపంలోని మామిడి తోటలో మంగళవారం సంఘ సమావేశం నిర్వహించారు.

ప్రమాణం చేస్తున్న మండల విశ్వబ్రాహ్మణ సంఘం కార్యవర్గ ప్రతినిధులు

జలుమూరు: సంఘటిత పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతా యని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు సింహాద్రి ధనుంజయరావు అన్నారు. చల్లవానిపేట సబ్‌స్టేషను సమీపంలోని మామిడి తోటలో మంగళవారం సంఘ సమావేశం నిర్వహించారు. మండల కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రతి మండలంలో సంఘాల ఏర్పాటు ద్వారా బలోపేతం చేయాలన్నారు. మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా వమరవెల్లి వీరాస్వామి, ఉపాధ్యక్షుడిగా సింహాద్రి అప్పలరాజు, ప్రధాన కార్యదర్శిగా సింహాద్రి రామకృష్ణ, సహాయ కార్యదర్శిగా గానుగుల మధు, కోశాధికారిగా దమరసింగి చందర్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో లింగాలవలస, చల్లవానిపేట సర్పంచ్‌లు దుంగ స్వామిబాబు, పంచిరెడ్డి రామచంద్రరావు, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:59 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising