ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పలాసలో వైసీపీకి షాక్‌

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:57 PM

పలాస నియోజకవర్గంలో వైసీపీకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పలాస-కాశీబుగ్గ మునిసి పాలి టీ పరిధి మూడో వార్డు పద్మనాభపురం, జయరామచంద్రాపురం, పెంటి భద్ర నుంచి సుమారు 125 మంది వైసీపీని వీడి ఆదివారం టీడీపీలో చేరారు. వీరికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పార్టీ కండు వాలు వేసి ఆహ్వానించారు.

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారితో గౌతు శిరీష

పార్టీని వీడి 125 మంది టీడీపీలో చేరిక

కాశీబుగ్గ, డిసెంబరు 17: పలాస నియోజకవర్గంలో వైసీపీకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పలాస-కాశీబుగ్గ మునిసి పాలి టీ పరిధి మూడో వార్డు పద్మనాభపురం, జయరామచంద్రాపురం, పెంటి భద్ర నుంచి సుమారు 125 మంది వైసీపీని వీడి ఆదివారం టీడీపీలో చేరారు. వీరికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పార్టీ కండు వాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. నియోజకవర్గంలో వైసీపీకి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందన్నారు. టీడీపీలోకి భారీగా చేరికలు ఉంటాయని చెప్పారు. మంత్రి అప్పలరాజు తీరు అంద రికీ అర్ధమైందన్నారు. ఐదేళ్లుగా మాటలు తప్ప ఎటువంటి అభివృద్ధి చేపట్టలేదని విమర్శించారు. ఓటమి అర్ధమయ్యే సీఎం జగన్‌ జిమ్మి క్కులు చేస్తున్నారని, అభివృద్ధి పేరిట హడావుడి చేస్తున్నారని, అయితే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. మందస మండలంలో నల్లబొడ్లూరుకొండ, రామ కృష్ణాపురంలోని ఉజ్జుడు మెట్ట, కాశీబుగ్గ సూదికొండ, నెమలికొండ లన్నింటినీ వైసీపీ నేతలు మింగేశారని, ఇంకా బెండికొండ, వెంకట నగర్‌కొండ మిగిలాయని వాటిని కూడా కబ్జా చేస్తారని విమర్శించారు. ఉద్దానంపై ప్రేమ ఉన్నట్లు మంత్రి మాట్లాడుతున్నారని, పలాస ప్రభు త్వాసుపత్రిలోని పరికరాలను కిడ్నీ ఆసుపత్రికి తరలించా రన్నారు. ఐదేళ్ల నుంచి కిడ్నీ ఆసుపత్రి తప్పా ఇంకేం చేశావని ప్రశ్నించారు. రాజకీయా లను రాజకీయంగా చూడాలి తప్ప కుటుంబాలపై కేసులు పెట్టి చిల్లర రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేం దుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి చరమ గీతం పాడేందుకు రెండు నెలలు మాత్రమే ఉందని, అందరూ రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. వైసీపీ నుంచి టీడీపీ లో చేరిన వారిలో రోజా, రామారావు, మౌనిక, కుమారి, కాశమ్మ, బాలమ్మ, గంగ మ్మ, శంకర్‌రావు, తిరుపతిరావు, మదన్‌, కృష్ణ తదితరులున్నారు. కార్య క్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, నేతలు గాలి కృష్ణా రావు, పీరుకట్ల విఠల్‌రావు, బడ్డ నాగరాజు, సప్ప నవీన్‌, సూర్యనారా యణ, సారా నోములరావు, కొండే నరసింహులు, కొండే యుగంధర్‌, సవర రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:57 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising