ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యువగళం’తో వైసీపీలో వణుకు

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:02 AM

యువగళం పాదయాత్ర ముగింపు సభతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, కిమిడి కళా వెంకటరావు అన్నారు.

మాట్లాడుతున్న దేవినేని ఉమామహేశ్వరరావు

- మాజీ మంత్రులు దేవినేని, కళావెంకటరావు

లావేరు: యువగళం పాదయాత్ర ముగింపు సభతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, కిమిడి కళా వెంకటరావు అన్నారు. ఆదివారం లావేరు మండలం సుభద్రాపురంలో కళా వెంకటరావు అధ్యక్షతన పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. భోగాపురంలో ఈ నెల 20న నిర్వహించనున్న యువగళం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎచ్చెర్ల నియోజకవర్గం కనీసం 50వేల మంది వరకు జన సమీకరణ చేపట్టాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని.. వైసీపీ అరాచకాలకు గుణపాఠం తప్పదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌ నాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు ముప్పిడి సురేష్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ ఇనపకుర్తి తోటయ్యదొర, పిన్నింటి మధుబాబు, ఆర్‌.ప్రకాశరావు, లంక నారాయణరావు, గంట్యాడ మహేష్‌, మీసాల వెంకటరమణ, దన్నాన శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:02 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising