దుబాయ్‌లో కేసరిపాడు వాసి మృతి
ABN, Publish Date - Dec 17 , 2023 | 12:13 AM
కేసరిపాడ గ్రామానికి చెందిన మాల్లర్పు ధర్మారావు (39) మూడు రోజులు కిందట దుబాయ్‌లో మృతి చెందాడు.
కంచిలి: కేసరిపాడ గ్రామానికి చెందిన మాల్లర్పు ధర్మారావు (39) మూడు రోజులు కిందట దుబాయ్‌లో మృతి చెందాడు. ఈ మేరకు అతని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉపాధి కోసం ధర్మారావు దుబాయ్ వెళ్లి ఓ కంపెనీలో మిషన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజులు కిందట ధర్మారావు మృతి చెందినట్టు కంపెనీ నుంచి సమాచారం వచ్చిం ది. ధర్మారావు మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే పిరాయా సాయిరాజ్‌ను కోరారు. సమాచారం తెలుసుకున్న సాయిరాజ్ శనివారం స్వగ్రామాని కి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ధర్మారావు మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈయనతోపాటు యుగంధర్ తదితరులు ఉన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 12:13 AM