ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పవన్‌ కల్యాణ్‌ పోరాటంతోనే కిడ్నీ ఆసుపత్రి నిర్మాణం

ABN, Publish Date - Dec 14 , 2023 | 12:25 AM

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోరాటంతోనే కిడ్నీ ఆసు పత్రి సాధ్య పడిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, జన సేన నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ దుర్గారావు అన్నారు. కాశీబుగ్గలో బుధ వారం విలేకరు లతో మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్‌ ఉద్దాన ప్రాంతంలో పర్యటిస్తూ ఇక్కడి కిడ్నీ రోగులు స్థితిగతులను తెలుసుకొని 2018లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కిడ్నీ వ్యాధి గ్రస్తులపై పూర్తి పరిశోధన చేయించారన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ, జనసేన నేతలు

కాశీబుగ్గ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోరాటంతోనే కిడ్నీ ఆసు పత్రి సాధ్య పడిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, జన సేన నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ దుర్గారావు అన్నారు. కాశీబుగ్గలో బుధ వారం విలేకరు లతో మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్‌ ఉద్దాన ప్రాంతంలో పర్యటిస్తూ ఇక్కడి కిడ్నీ రోగులు స్థితిగతులను తెలుసుకొని 2018లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కిడ్నీ వ్యాధి గ్రస్తులపై పూర్తి పరిశోధన చేయించారన్నారు. కిడ్నీ ఆసుపత్రిలో 100 డయాలసిస్‌ బెడ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో కిడ్నీ రోగులకు ఉచితంగా మందులు పంపిణీ, రవాణా చార్జీలు ఇచ్చేవారని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిలిపి వేశారన్నారు. కిడ్నీ ఆసుపత్రికి టీడీపీ హయంలోనే భూమి పూజ జరిగిందని, ఎన్నికల ముందు ప్రజలను మోసం చేయడమే తప్ప పరికరాలు లేని కిడ్నీ ఆసుపత్రిని ప్రారంభించేందుకు సీఎం రావడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో లొడగల కామేశ్వరరావు యాదవ్‌, గాలి కృష్ణారావు, బడ్డ నాగరాజు, సప్ప నవీన్‌, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 12:25 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising