ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీఎం జగన్‌ హామీల్లో 15 శాతం మాత్రమే అమలు

ABN, Publish Date - Dec 30 , 2023 | 12:02 AM

సీఎం జగన్మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీలు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటిలో కేవలం 15 శాతమే అమలు చేశారని, 85 శాతం హామీల అమలులో విఫలమయ్యారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు.

‘85 శాతం హామీలు విఫలం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష

పలాస, డిసెంబరు 29: సీఎం జగన్మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీలు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటిలో కేవలం 15 శాతమే అమలు చేశారని, 85 శాతం హామీల అమలులో విఫలమయ్యారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. జగన్‌రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో కేవలం 109 పథ కాలు మాత్రమే అమలు చేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలు మొత్తం 730 ఉన్నా యని, కేవలం 15 శాతం హామీలే నెరవేర్చారన్నారు. టీడీపీ హయాంలో 120 సంక్షేమ పథకాలు అమలు చేస్తే వాటిని వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేసిందన్నారు. ప్రతి ఏటా పింఛన్‌ రూ.250 పెంచుతానని హామీ ఇచ్చి దానిని అమలు చేయకపోవడం వల్ల ఒక్కో పింఛన్‌దారుకి రూ.25 వేలు నష్టం కలిగించారన్నారు. సీపీఎస్‌ రద్దుతో పాటు అంగన్‌ వాడీ, మునిసిపల్‌ పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్క రించకుండా ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. దాని ఫలితంగా వారంతా రోడ్డున పడే పరిస్థితి నెలకొం దన్నారు. 20 కిలోమీటర్ల దూరానికి సీఎం హెలీ కాఫ్టర్‌లో ప్రయాణిస్తూ ప్రజాధనాన్ని వృధా చేశారని, రాష్ట్రంలో పరిశ్ర మలు పెట్టక పొరుగు రాష్ట్రాలకు పరారీ అవుతున్నా రని దుయ్యబట్టారు. ఆఫ్‌ షోర్‌ రిజర్వాయర్‌ పూర్తి చేసిన తరువాతే ఎన్నికలకు వెళ్తామని ఇచ్చి న హామీని మరిచారని, కేటీ రోడ్డును మూడేళ్లయినా పూర్తి చేయలేకపో యారన్నారు. టీడీపీ అధినేత చంద్ర బాబు హయాంలో జరిగిన కిడ్నీ ఆసుపత్రిని తన ఖాతాలో వేసుకొని ఉన్న డయాలసిస్‌ కేంద్రాలను ఎత్తివేసిన ఘనత మంత్రి అప్పల రాజుకే దక్కిం దని ఎద్దేవా చేశారు. అంతకుముందు ‘85 శాతం హామీలు విఫలం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, రాష్ట్ర బీపీ సెల్‌ కార్యదర్శి లొడ గల కామేశ్వ రరావు యాదవ్‌, జిల్లా కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు, గురిటి సూర్యనారా యణ, సప్ప నవీన్‌, అవుగాన దశరథ పాల్గొన్నారు.

టీడీపీతోనే అగ్నికుల క్షత్రియుల అభివృద్ధి
మందస:
అగ్నికుల క్షత్రియుల అభివృద్ధి టీడీపీ పాలన లోనే సాధ్యమైందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. భేతాళపురంలో శుక్రవారం అగ్నికుల క్షత్రి యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీడీపీ అగ్నికుల క్షత్రియులకు ఉన్నత పదవులిచ్చి గౌరవించిందని, అయితే ప్రస్తుత వైసీపీ ప్రభు త్వంలో వారికి సరైన చోటు లభించలేదన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి సహకరించాలని కోరారు. కార్య క్రమంలో అగ్నికులక్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షుడు జి. వసంతస్వామి, నేతలు జుత్తు కూర్మారావు, లబ్బ రుద్ర య్య, తామాడ లోకనాథం, జుత్తు అమ్మినాయుడు, బత్తిన కృష్ణా రావు, జీకే నాయుడు, టి.తుంబనాథం పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:02 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising