ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాష్ట్రాన్ని అప్పులపాల్జేసిన జగన్‌రెడ్డి

ABN, First Publish Date - 2023-12-11T00:22:54+05:30

దేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రంగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల అన్వేషణలో కేంద్రం చుట్టూ తిరుగుతూ బిచ్చమెత్తుకునేలా సైకో సీఎం జగన్‌రెడ్డి మార్చేశారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

సరుబుజ్జిలి: బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో రవికుమార్‌, పార్టీ శ్రేణులు

- టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌

సరుబుజ్జిలి: దేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రంగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల అన్వేషణలో కేంద్రం చుట్టూ తిరుగుతూ బిచ్చమెత్తుకునేలా సైకో సీఎం జగన్‌రెడ్డి మార్చేశారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సరుబుజ్జిలి గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు అంబళ్ల రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. రాష్ట్రంలో 100 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన సైకో సీఎం జిల్లాలో ఒక్క మండలం కూడా లేకపోవడం ఆ పార్టీ నేతల చేతకాని తనానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నందివాడ గోవిందరావు, ఎండ రామారావు, దవళ సింహాచలం, కొమనాపల్లి రవికుమార్‌, ప్రభాకర్‌, ఎన్‌.రమేష్‌, ఎన్‌.రామకృష్ణ, గుర్రాల చిన్నబాబు, తోట రాము, ఆమదాలవలస నియోజకవర్గ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు నూక ప్రభాకర్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శివ్వాల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- ఇచ్ఛాపురం రూరల్‌: టీడీపీ అధినేత చంద్ర బాబుతోనే సంక్షేమం, రాష్ట్రాభి వృద్ధి సాధ్యమని టీడీపీ నాయకులు లోపింటి పద్మనాభం అన్నారు. ఆదివారం పాయితారి, కీర్తిపురం గ్రామాల్లో బాబు ష్యూరిటీ భవిష్య త్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గిన్ని బాలరాజు, బరిక్‌ బెహరా, తలగాన మన్మఽథరావు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

- గార: గారలో ఆదివారం టీడీపీ నాయకులు జల్లు రాజీవ్‌ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి పార్టీ మేని ఫెస్టోను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆరంగి గోవిం దరాజులు తదితరులు పాల్గొన్నారు.

- పాతపట్నం: టీడీపీ తోనే యువత ఉజ్వల భవిష్య త్‌ సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి అన్నారు. స్థానిక క్యాంపు కా ర్యాలయంలో ఆదివారం యు వతతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. టీడీసీ అధికారం లోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. కార్యక్రమం లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కల మట సాగర్‌, పార్టీ పట్టణాధ్యక్షుడు సైలాడ సతీష్‌, నాయకులు పైల లక్ష్మయ్య, మడ్డు రామారావు, వసంత్‌, రుంకు చలపతి, వట్టి కన్నారావు, కె.రాము కర్రి అప్పారావు, కనకల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం రావణకాష్టం: బగ్గు

జలుమూరు(సారవకోట): వైసీపీ పాలనలో రాష్ట్రం రావణకాష్టంగా మారిందని నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి విమర్శించారు. గొర్రిబంద పంచాయతీ బురుజువాడ, జగన్నాఽథపురం గ్రామాల్లో ఆదివారం రాత్రి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేసిందన్నారు. సంక్షేమ పథకాల పేరుతో నిరుపేదలను నట్టేట ముంచారన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనుక్కి పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర బీసీ కమిటీ ప్రతినిధి ధర్మాన తేజకుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, నాయకులు సురవరపు తిరుపతిరావు, పిళ్లా నందకిషోర్‌, పట్ట ఉమామహేశ్వరావు, బైరి భాస్కరరావు, తాడేల భీమారావు, డి.జయరాం, రామారావు, కోన వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. బైదలాపురంలో బాబు ష్యూరిటీ, భవిష్యతుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ ఇంటింటికీ వెళ్లి టీడీపీ మేనిఫెస్టోను వివరించారు. మాజీ సర్పంచ్‌ ధర్మాన ఈశ్వరరావు, మర్రివలస సింహాచలం, బోర ధర్మారావు, బోర త్రినాఽథరావు తదితరులు పాల్గొన్నారు.

సైకో పాలనను సాగనంపుదాం: కలమట

హిరమండలం: మూడు నెలలు ఓపిక పట్టండి.. రాష్ట్రంలో కొనసాగుతున్న సైకో పాలనను సాగ నంపుదామని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. ఆదివారం భగీరథపురం కాలనీలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల పేరుతో సైకో సీఎం జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే భవిష్యత్‌ అంధకారంగా మారిపోతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పి.బుచ్చిబాబు, పార్టీ మండల అధ్యక్షుడు చెట్టు శ్రీనివా సరావు, నాయకులు కె.నాగరాజు, కె.సింహాచలం, బి.సురేష్‌, బి.శివా జి, మురళీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T00:22:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising