పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:57 PM
పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని సూర్యమహాల్ థియేటర్ సమీపంలోని విద్యుత్‌శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
అరసవల్లి: పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని సూర్యమహాల్ థియేటర్ సమీపంలోని విద్యుత్‌శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. వైసీపీ అధికారం లోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలు నాలుగు రెట్లు పెంచారన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల వినియోగదారులపై భారం వేశారని మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, నియోజకవర్గ కన్వీనర్ పైడి వేణుగోపాలం, నాయకులు తిరుపతిరావు, రవిబాబ్జీ, ఉమామహేశ్వరి, సూరపునాయుడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 11:57 PM