పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలి
ABN, Publish Date - Dec 23 , 2023 | 12:23 AM
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణం తగ్గించాలని బీజే పీ జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు, పలాస నియోజకవర్గ కన్వీనర్ రామానంద స్వామి డిమాండ్ చేశారు.
కాశీబుగ్గ: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణం తగ్గించాలని బీజే పీ జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు, పలాస నియోజకవర్గ కన్వీనర్ రామానంద స్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. పెరిగిన చార్జీలతో సామాన్య ప్రజలు అల్లాడుతున్నారన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యులు ఎలా బతకాలని ప్రశ్నిం చారు. తక్షణం పెంచిన చార్జీలు, ధరలను తగ్గించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ కార్యదర్శి పి.వైకుంఠరావు, నేతలు బాలకృష్ణ, మోహన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 23 , 2023 | 12:23 AM