జీవో 117ను రద్దు చేయాలి
ABN, First Publish Date - 2023-10-30T01:11:19+05:30
విద్యారంగాన్ని నాశనం చేస్తున్న జీవో 117ను రద్దు చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పడాల తమ్మి నాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక క్రాంతి భవన్ లో సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన జీపీ ఎస్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఓపీఎస్‌ను పునరుద్ధరిం చాలని కోరారు.
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పడాల తమ్మినాయుడు
అరసవల్లి: విద్యారంగాన్ని నాశనం చేస్తున్న జీవో 117ను రద్దు చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పడాల తమ్మి నాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక క్రాంతి భవన్ లో సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన జీపీ ఎస్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఓపీఎస్‌ను పునరుద్ధరిం చాలని కోరారు. రాష్ట్ర అదనపు ప్రధాన కార్య దర్శి పేడాడ ప్రభాకరరావు మాట్లాడుతూ.. జీవో 117 ద్వారా ఐదేళ్లలో పాఠ శాలలను, ఉపాధ్యాయులను 50 శాతానికి తగ్గించాలనే ఆలో చనలో వైసీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. నాడు- నేడు లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన పాఠశాలలు కూడా మూసివేసే పరిస్థితి వచ్చిందని వాపోయారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రమణమూర్తి మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా ఉద్యో గులు దాచుకున్న నగదును అవసరాలకు ఇవ్వకుండా ఇబ్బం దులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జీతం కూడా ఎప్పు డు వస్తుందో తెలియని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొ నడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం 2003 డీఎస్సీ ఉపా ధ్యాయులను పాత పెన్షన్ స్కీంలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా వైసీపీ ప్రభుత్వం అమలు చేయడంలేదన్నారు. ఉపాధ్యాయ వ్యవస్థలో ఎంటీఎస్ విధానాన్ని రద్దు చేసి 1998, 2008 డీఎస్సీ వారిని బేషరతుగా రెగ్యులర్ చేయాలని డిమాం డ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు సన్యాసిరావు, ప్రతినిధులు గురుగుబెల్లి రమణ, ఇందిర, గురువు శ్రీను, మొయ్యి తేజేశ్వరరావు, గోవిందరావు, బొడ్డేపల్లి సత్యం, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-10-30T01:11:19+05:30 IST