ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ మాయమాటలను నమ్మవద్దు

ABN, Publish Date - Dec 28 , 2023 | 11:54 PM

వైసీపీ నాయకుల మాయమాటలను నమ్మవద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం జిల్లాలో పలుచోట్ల బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. బాండ్లు పంపిణీచేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలుచేసే పథకాలను వివరించారు. వైసీపీ ప్రభుత్వ వైఫలాలను తెలియజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ జగన్‌ అవినీతి పాలనను అంతంచేయాలని కోరారు.

పాతపట్నం: దశరధపురంలో బాబుష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌

వైసీపీ నాయకుల మాయమాటలను నమ్మవద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం జిల్లాలో పలుచోట్ల బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. బాండ్లు పంపిణీచేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలుచేసే పథకాలను వివరించారు. వైసీపీ ప్రభుత్వ వైఫలాలను తెలియజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ జగన్‌ అవినీతి పాలనను అంతంచేయాలని కోరారు.

ఫ పాతపట్నం: చంద్రబాబుతోనే రాష్ట్రంలో సుస్థిరపాలన సాధ్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌ తెలిపారు.మండలంలోని దశరధపు రం, సూర్యనారాయణపురం కాలనీల్లో బాబుష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ, గ్రామకూడలిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో టీడీపీ బీసీసెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైల లక్ష్మయ్య, పార్టీనాయకులు కొంచాడ రుద్ర, శివాల కృష్ణ, వెంకటరావు, కె.గణపతి, బి.ధర్మారావు, కె.పార్వతీశం, పి.రమేష్‌, రోకళ్ల శివాజీ, పి.మాధవ, పి.దాలయ్య పాల్గొన్నారు.

ఫనరసన్నపేట: అవినీతి ఊబిలో కూరుకుపోయిన సీఎం జగన్‌ను ఇంటికి పంపకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని టీడీపీ నాయకులు కిం జరాపు రామారావు, సతీష్‌, గోవిందరాజు తెలిపారు. పట్టణంలో జోగి పేటలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు.

ఫ వజ్రపుకొత్తూరు:చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని పూండి క్లస్టర్‌ ఇనచార్జి పుచ్చఈశ్వరరావు తెలిపారు. అమలపాడులో బాబు ష్యూరిటీ-భవి ష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం మాజీసర్పంచ్‌షణ్ముఖరావు ఆధ్వర్యంలో జరి గింది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్నిరమణ, గోవిందు పాపారావు, చింతనారాయణ, కారాడ సన్యాసి, దండు జోగారావు పాల్గొన్నారు.

ఫ జలుమూరు: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ సర్పంచ్‌ పొన్నాడ దాలయ్య తెలిపారు. సారవకోట మండలంలోని కరకవలసకాలనీలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వ హిం చారు. కార్యక్రమంలో శ్రీముఖలింగం మాజీ సర్పంచ్‌ తర్ర బలరాం, జి.వెంకటరమణ పాల్గొన్నారు.

ఫజలుమూరు (సారవకోట) : టీడీపీతోనే భావితరాల భవిష్యత్తు బాగుంటుందని సారవకోట టీడీపీ మండలాధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ తెలిపారు. మండలం తొగిరిలో బాబుష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకుడు పిళ్లా నందకిషోర్‌, తెలుగు రైతు మండలాధ్యక్షుడు తండ్యాల సింహాచలం, నేతింటి ఈశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 11:54 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising