అరసవల్లికి పోటెత్తిన భక్తులు
ABN, First Publish Date - 2023-12-11T00:29:02+05:30
కార్తీకమాసం చివరి ఆదివారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటె త్తారు. అనివెట్టి మండపంలో నిర్వహించిన సూర్యనమస్కారాల కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అరసవల్లి, డిసెంబరు 10: కార్తీకమాసం చివరి ఆదివారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటె త్తారు. అనివెట్టి మండపంలో నిర్వహించిన సూర్యనమస్కారాల కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కేశఖండన శాల వద్ద భక్తుల రద్దీ కనిపించింది. గంటల కొద్దీ క్యూలో నిరీక్షించాల్సిన రావడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. కేశఖండన శాల వద్ద క్షురకులు మామూళ్లు డిమాండ్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. ఆదివారం ఒక్కరోజే స్వామివారికి రూ.10,60,812 ఆదాయం లభించింది. టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.6,64,900, విరాళాల రూపంలో రూ.85,912, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.3,10,000 వచ్చాయని ఆలయ అధికారులు తెలిపారు.
Updated Date - 2023-12-11T00:29:04+05:30 IST