ముగిసిన అంతర జిల్లా టెన్నీ కాయిట్ పోటీలు
ABN, Publish Date - Dec 30 , 2023 | 11:53 PM
స్థానిక మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న 41వ ఏపీ అంతర్ జిల్లా టెన్నీ కాయిట్ పోటీలు శనివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో జి.పగడాలమ్మ, సిరిపురం తేజేశ్వరరావు, టెన్నీ కాయిట్ సంఘం రాష్ట్రకార్యదర్శి పి.సత్యనారాయణ పాల్గొని విజేత లకు బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందించారు.
పాతపట్నం: స్థానిక మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న 41వ ఏపీ అంతర్ జిల్లా టెన్నీ కాయిట్ పోటీలు శనివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో జి.పగడాలమ్మ, సిరిపురం తేజేశ్వరరావు, టెన్నీ కాయిట్ సంఘం రాష్ట్రకార్యదర్శి పి.సత్యనారాయణ పాల్గొని విజేత లకు బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందించారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు వీరే..
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారుల వివరాలను క్రీడల నిర్వాహక అధ్యక్షుడు యెన్ని శేఖర్‌బాబు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. పురుషుల విభాగంలో పీజేఎండీ రామారావు, వి.వినయ్ కుమా ర్, ఎల్.త్రిమూర్తులు (మండపేట మండలం, ఈస్ట్‌గోదావరి), సీహెచ్ తార కేశ్వరరావు, పి.జగదీష్ బెహరా, కె.గోవిందరావు(పలాస, శ్రీకాకుళం), కె.వంశీ(చింతపూడి మండలం, వెస్ట్‌గోదావరి), బి.చంటిబాబు (లింగపాలెం మండలం, వెస్ట్ గోదావరి). మహిళావిభాగంలో ఆర్.మౌనిక, పి.రేణుక, ఎం.ప్రవల్లిక, జి.శ్రావణి(గరివిడి మండలం, విజయనగరం), జి.అమృత (సెత్తూరు మండలం, అనంతపురం), ఎస్.పల్లవి శ్వేతశ్రీ (భీముని గుమ్మం, అనకాపల్లి), కె.మౌనిక(కె.గోకవరం, వెస్ట్ గోదావరి), వై.అలేఖ్య (లింగ పాలెం, వెస్ట్ గోదావరి) ఎంపికయ్యారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపి కైన క్రీడాకారులను అతిథులు అభినందించారు. కార్యక్రమంలో పి.తవి టయ్య, నల్లి రాజారావు, డా.మల్లికార్జునరావు, జి.అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 30 , 2023 | 11:53 PM