క్షతగాత్రుడి బంధువుల ఆందోళన
ABN, First Publish Date - 2023-11-10T00:33:36+05:30
రూరల్ మండలం రాగోలులో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో క్షతగాత్రుడి బంధువులు ఆందోళ న చేపట్టారు.
శ్రీకాకుళం క్రైం: రూరల్ మండలం రాగోలులో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో క్షతగాత్రుడి బంధువులు ఆందోళ న చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు, ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. పోలాకి మండలం రాళ్లగోదాయవలస గ్రామానికి చెందిన పిల్లల పున్నయ్య(31) అనే వ్యక్తి గత నెలాఖరులో టెక్కలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తీవ్రంగా గా యపడిన పున్నయ్యను టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రికి తర లించగా, మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. రిమ్స్‌లో చేర్చిన తర్వాత అతడి పరిస్థితి విషమంగా ఉందని కేజీహెచ్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. అయితే క్షతగాత్రుడిని అక్టోబరు 30వ తేదీన రాగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పిం చారు. ఈ నెల 6వ తేదీన జనరల్ వార్డులో ఉన్న పున్న య్యను వైద్యులు డిశ్చార్జ్ చేయగా, అదే సమయంలో పున్నయ్య అక్కడే కళ్లు తిరిగి పడిపోయాడు. పరీక్షించిన వైద్యులు తలలో బ్లీడింగ్ అవుతుందని చెప్పి, కుటుంబ సభ్యుల సమ్మతితో అదే రోజు రాత్రి అతడికి శస్త్ర చికిత్స చేశారు. అప్పటికీ అతడి పరిస్థితి మెరుగుపడకపోగా, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పున్నయ్యను వైద్యులు పరీక్షించగా బ్రెయిన్ డెడ్ అయిందని నిర్ధారించారు. దీంతో క్షతగాత్రుడి బంధువులు, భార్య కృష్ణవేణి మాత్రం వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ గురువారం రాత్రి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. పరిస్థితి తెలు సుకున్న రూరల్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఆందో ళనకారులతో మాట్లాడి సర్దిచెప్పారు.
Updated Date - 2023-11-10T00:33:37+05:30 IST