క్రిస్మస్ వెలుగులు
ABN, Publish Date - Dec 24 , 2023 | 12:23 AM
క్రిస్మస్‌ను పురస్కరించుకుని.. శ్రీకాకుళంలోని వివిధ చర్చిలను వేడుకలకు సిద్ధం చేశారు.
గుజరాతీపేట, డిసెంబరు 23: క్రిస్మస్‌ను పురస్కరించుకుని.. శ్రీకాకుళంలోని వివిధ చర్చిలను వేడుకలకు సిద్ధం చేశారు. విద్యుత్ వెలుగులతో అలంకరించారు. శ్రీకాకుళంలోని తెలుగు బాప్టిస్టు చర్చిలో పెద్ద ఎత్తున క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేశారు. అలాగే లూథరన్ చర్చిలో విద్యుత్ అలంకరణ మధ్య పాకలో బాల ఏసు ప్రతిమలు నెలకొల్పారు. క్రీస్తు ఆరాధన కేంద్రం, మారథాన్, సహాయమాత, సెయింట్ థామస్ తదితర చర్చిలను సుందరంగా అలంకరించారు.
Updated Date - Dec 24 , 2023 | 12:23 AM