టెక్కలి కేంద్రాసుపత్రిలో కీమోథెరపీ
ABN, Publish Date - Dec 28 , 2023 | 11:52 PM
టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రిలో డేకేర్ కీమోఽథెరపీవిభాగం ఏర్పా టుకు వైద్యఆరోగ్యశాఖ అధికారులు సన్నాహాలుచేస్తున్నారు. క్యాన్సర్ రోగులకు కీమోథెరఫీ చికిత్సను ఇక్కడ అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
టెక్కలి రూరల్: టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రిలో డేకేర్ కీమోఽథెరపీవిభాగం ఏర్పా టుకు వైద్యఆరోగ్యశాఖ అధికారులు సన్నాహాలుచేస్తున్నారు. క్యాన్సర్ రోగులకు కీమోథెరఫీ చికిత్సను ఇక్కడ అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈమేరకు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సివిల్‌అసిస్టెంట్ సర్జన్లు, ఆరుగురు స్టాఫ్ నర్సులు విశాఖలోని హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్‌లో శిక్షణపొందారు. వైద్యసిబ్బంది శిక్షణ అనంతరం ఆసుపత్రిలో కీమోథె రపీ విభాగం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. విభాగానికి అవసరమైన మం దులను శ్రీకాకుళం సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు. టెక్కలిలో క్యాన్సర్ చికిత్సకు ప్రత్యేక విభాగం ఏర్పాటుచేస్తే రోగు లు చికిత్స అందుబాటులోకి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. కాగా కీమో ఽథెరపీ చికిత్సకు సంబంధించి విశాఖలోవైద్యులు, సిబ్బంది శిక్షణ పొందారని జిల్లా ప్రాంతీయాసుపత్రుల సమన్వయకర్త జె.భాస్కరరావు ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్యాన్సర్ రోగులకు ఉపయోగపడే విధంగా డే కేర్ కీమోఽథెరపీ విభాగం ఏర్పాటుకు చర్యలు చేపడతున్నట్లు చెప్పారు.
కొండపోరంబోకును రక్షిం
Updated Date - Dec 28 , 2023 | 11:52 PM