ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బ్రిటీష్‌ వారి గుండెల్లో తూటా.. గరిమెళ్ల పాట

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:56 PM

తన కలం నుంచి జాలు వారిన ఓ గీతం బ్రిటీష్‌ వారి గుండెల్లో తూటా పేల్చిం ది.. ‘మా కొద్దీ తెల్లదొరమంటూ’ ప్రారంభమైన ఈ గీతాన్ని తన గళంతో పాడి బ్రిటీష్‌ వారిని గడగడలా డించారు గరిమెళ్ల.. పోలాకి మండలం ప్రియాగ్రహా రానికి చెందిన గరిమెళ్ల సత్యనారాయణ తన గీతంతో ఎందరినో స్వాతంత్య్ర సమరంలోకి ఉరికించి స్ఫూర్తి దాయకంగా నిలిచారు..

గరిమెళ్ల చిత్రంతో తపాలా కవర్‌

నేడు సత్యనారాయణ 71వ వర్ధంతి

పోస్టల్‌ కవర్‌ విడుదలకు చర్యలు

ప్రియాగ్రహారం(పోలాకి): తన కలం నుంచి జాలు వారిన ఓ గీతం బ్రిటీష్‌ వారి గుండెల్లో తూటా పేల్చిం ది.. ‘మా కొద్దీ తెల్లదొరమంటూ’ ప్రారంభమైన ఈ గీతాన్ని తన గళంతో పాడి బ్రిటీష్‌ వారిని గడగడలా డించారు గరిమెళ్ల.. పోలాకి మండలం ప్రియాగ్రహా రానికి చెందిన గరిమెళ్ల సత్యనారాయణ తన గీతంతో ఎందరినో స్వాతంత్య్ర సమరంలోకి ఉరికించి స్ఫూర్తి దాయకంగా నిలిచారు.. ఆయన 71వ వర్ధంతిని సోమ వారం నిర్వహిస్తున్న సందర్భంగా కథనం..

బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగం

స్వాతంత్య్ర సమరయోధునిగా, ప్రజాకవిగా, పత్రికా సంపాదకుడిగా పేరుపొందిన గరి మెళ్ల సత్యనారాయణ 1893 జూలై 15న సూరమ్మ, వెంకటనర్సింహం దంపతులకు జన్మిం చారు. ప్రాథమిక విద్య ప్రియా గ్రహారంలో సాగింది. ఉన్నత చదువులు విజయనగరం, విశాఖపట్నం, మచిలీపట్నం, రాజమహేంద్ర వరంలో చదివారు. బీఏ పూర్తయిన తరువాత గంజాం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గుమస్తాగా, ఆ తరువాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు.

స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి...

1920 డిసెంబరులో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలో సహాయనిరాకరణకు తీర్మానం చేశారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని వీరావేశంతో స్వతంత్య్ర ఉద్యమంలోకి దూకిన గరిమెళ్ల.. ‘మాకొద్దీ తెల్లదొర తనమూ..’ గేయాన్ని రాసి అందరిలో ఉద్యమ స్ఫూర్తి రగిలించగా ఆ నోటా.. ఈ నోటా ఈ గేయం బ్రిటీష్‌ కలెక్టర్‌ టీహెచ్‌ బేకన్‌ చెవిన పడింది. ఆయన గరిమెళ్లను పిలిపించి పాటను పూర్తిగా పాడమన్నారట.. వెంటనే ఈ గేయానికి చెలించిన కలెక్టర్‌ పాటను రాసి, పాడినందుకు కఠిన కారాగార శిక్ష విధించారు. 1923లో గరిమెళ్ల జైలులో ఉండగా తండ్రి చనిపోయారు. మీరు క్షమాపణ చెబితే కారాగార శిక్ష నుంచి తప్పిస్తామని చెప్పినప్పటికీ గరిమెళ్ల దానిని తిరస్కరించి తండ్రి పోయిన బాధతోనే జైలు జీవితం అను భవించిన దేశభక్తుడు గరిమెళ్ల.. జైలు నుంచి విడుదల కాగానే ప్రజలు ఆయనకు అనేక చోట్ల సత్కరించారు. కొద్ది రోజులకే భార్య చనిపోయింది. ఆయనకు ఇరు వురు కుమార్తెలున్నారు. ఉద్యోగం విడిచిపెట్టి ప్రియాగ్రహారంలో శారదా గ్రంథాలయం స్థాపించి నిర్వహించారు. దీని ద్వారా 18 రకాల గ్రంథాలను ముద్రించారు. 1921లో స్వరాజ్య గీతాలు, 1923లో హరిజన పాటలు, 1926లో ఖండకావ్యాలు, బాల, భక్తి గీతాలను రచించి ముద్రించారు. గరిమెళ్ల అనేక పర్యాయాలు కారాగార శిక్ష అనుభవించారు. జైల్లోనే ఉంటూ కన్నడ, తమిళ గ్రంథాలను తెలుగుభాషలోకి అనువదించారు. 1937లో చీనా జపాన్‌, 1933లో గృహలక్ష్మి పత్రిక సంపాదకులుగా వ్యవహరించారు. ఆచార్యరంగా, వాహిని పత్రికల్లో సహాయ సంపాద కుడిగా పనిచేశారు. అనంతరం ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుగా వ్యవహరించారు. చివరకు పేదరికాన్ని అనుభ వించారు. మద్రాస్‌ వీధుల్లో భిక్షాటన చేస్తూ 1952 డిసెంబరు 18న కన్నుమూశారు.

నేడు వర్ధంతి సభ

గరిమెళ్ల వర్ధంతి కార్యక్రమాన్ని స్వగ్రామంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు బాడాన రాజు, శర్మ, కోటేశ్వరరావు, ఇలపండ గణపతిరావు, హెచ్‌ఎం విశ్వేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్‌ పోటీ విజేతలకు బహుమతులు అందించనున్నామన్నారు.

తపాలా కవర్‌ విడుదల

గరిమెళ్ల సత్యనారాయణ చిత్రంతో రూపొందించిన తపాలా కవర్‌ను విడుదల చేయనున్నట్లు పోస్టు మాస్టర్‌ జనరల్‌ కేవీరాములు, జిల్లా తపాలాధికారి పి. శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. ఇదిలా ఉండగా ఎప్పటినుంచో జిల్లాకు గరిమెళ్ల పేరు పెట్టా లన్న డిమాండ్‌ ఉంది. ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని పలువురు అభిమా నులు, జిల్లా వాసులు కోరుతున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising