మానవత్వం చూపండి.. జగన్‌గారూ!
ABN, First Publish Date - 2023-12-11T02:37:08+05:30
తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న నెపంతో పింఛను తొలగించడంతో అంధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై చంద్రబాబు ఎక్స్ వేదికగా
అమరావతి, గుంతకల్లు, డిసెంబరు10: తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న నెపంతో పింఛను తొలగించడంతో అంధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నక్కనదొడ్డి తండాకు చెందిన దివ్యాంగురాలైన గిరిజన యువతి సరోజమ్మకు వచ్చే వికలాంగ పింఛన్ తొలగించడంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనపై చలించిన చంద్రబాబు.. ‘కొంచెం మానవత్వం చూపండి జగన్‌గారూ! మాటల్లో కాదు చేతల్లో.. ఆంక్షల పేరుతో అంధురాలి పెన్షన్ తొలగింపు కర్కశత్వం. ఆమె ఆత్మహత్య అత్యంత హృదయవిదారకం’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కళ్లుండీ చూడలేని అంధ పాలకుడు సైకో జగన్ అడ్డగోలు నిబంధనలు దివ్యాంగురాలి ప్రాణం తీశాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు.
Updated Date - 2023-12-11T02:37:09+05:30 IST