ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీనియర్‌ పాత్రికేయుడు సుధాకర్‌రావు హఠాన్మరణం

ABN, First Publish Date - 2023-11-30T03:55:12+05:30

‘ఆంధ్రజ్యోతి’ నెల్లూరు యూనిట్‌లో సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఎంవీ.సుధాకర్‌రావు మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడకు

నెల్లూరు, నవంబరు 29: ‘ఆంధ్రజ్యోతి’ నెల్లూరు యూనిట్‌లో సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఎంవీ.సుధాకర్‌రావు మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడకు చెందిన ఆయన విద్యాభ్యాసం పూర్తయ్యాక 1990లో ‘ఆంధ్రజ్యోతి’లో చేరారు. ఎక్కువ కాలం తిరుపతిలో ఆయన పని చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ పునఃప్రారంభం నుంచి నెల్లూరు యూనిట్‌ కార్యాలయంలో సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సుధాకర్‌కు గుండెపోటు రాగా ఆసుపత్రికి తరలించేలోపే మార్గమధ్యంలో మృతి చెందారు. విషయం తెలుసుకుని పాత్రికేయులు బుధవారం నెల్లూరు కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఎ.జయప్రకాష్‌, జిల్లా అధ్యక్షుడు వల్లూరు వెంకటేశ్వర్లు తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. సాయంత్రం బోడిగాడితోటలో సుధాకర్‌రావు అంత్యక్రియలు జరిగాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Updated Date - 2023-11-30T03:55:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising