అక్రమ మైనింగ్ ఆపే వరకు సత్యాగ్రహం: సోమిరెడ్డి
ABN, Publish Date - Dec 18 , 2023 | 02:52 AM
అక్రమ మైనింగ్‌ను ఆపే వరకు వెనుదిరిగేది లేదని, సత్యాగ్రహ దీక్ష కొనసాగుతుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డితేల్చి చెప్పారు.
రుస్తుం, భారత్ మైన్స్‌లో కొనసాగుతున్న దీక్ష: నెల్లూరు నేతల మద్దతు
పొదలకూరు, డిసెంబరు 17: అక్రమ మైనింగ్‌ను ఆపే వరకు వెనుదిరిగేది లేదని, సత్యాగ్రహ దీక్ష కొనసాగుతుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డితేల్చి చెప్పారు. అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆయన చేపట్టిన స త్యాగ్రహ దీక్ష రెండో రోజుఆదివారం కూడా కొనసాగింది. సోమిరెడ్డికి సంఘీభావం గా పొదలకూరు, తాటిపర్తి, వరదాపురం గ్రామస్థులతోపాటు ఇతర మండల టీడీపీ నాయకులు నిరసన దీక్షలో పాల్గొన్నారు. సోమిరెడ్డి నిరసన దృష్ట్యా మైన్‌లో తాత్కాలికంగా పనులు నిలిచిపోయాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, పాశిం సునీల్‌కుమార్, ఆనం వెంకటరమణారెడ్డి, పోలంరెడ్డి దినే్‌షరెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డాక్టర్ మస్తాన్‌యాదవ్ వచ్చి సోమిరెడ్డికి సంపూర్ణ మద్దతు తెలిపారు.
Updated Date - Dec 18 , 2023 | 02:52 AM