పారిశుధ్య కార్మికుల సమ్మె సైరన్
ABN, First Publish Date - 2023-12-11T01:11:28+05:30
మునిసిపల్ కార్మికుల అపరిష్కృత సమస్యలపై డిసెంబరు 27 నుంచి సమ్మె నిర్వహిస్తున్నట్టు ఏపీ మునిసిపల్ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ ఆసుల రంగనాయకులు చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు,
27 నుంచి చేస్తామని జేఏసీ ప్రకటన
విజయవాడ, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): మునిసిపల్ కార్మికుల అపరిష్కృత సమస్యలపై డిసెంబరు 27 నుంచి సమ్మె నిర్వహిస్తున్నట్టు ఏపీ మునిసిపల్ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ ఆసుల రంగనాయకులు చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగరపంచాయతీలలో పనిచేస్తున్న మునిసిపల్ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పారిశుధ్య కార్మికులకు, టాయిలెట్ వర్కర్స్, అండర్ గ్రౌండ్ డ్రైయినేజీ వర్కర్లకు హెల్త్ అలవెన్సులు ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం మా మొర ఆలకించటం లేదు. కరోనా సమయంలో పారిశుధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేశారు. ఆ సమయంలో అనేకమంది తమ ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. కరోనా విపత్తులో మరణించిన వారికి ప్రభుత్వం రూ.50 లక్షలు సాయం ప్రకటించింది. ఆ సాయం గాలి మాటగా మారిపోయింది. టైమ్ స్కేల్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కొన్ని దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నాం. ఇప్పటి వరకు ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో గ్రాట్యుటీ చట్టం వర్తించటం లేదు. పండుగలు, జాతీయ సెలవు దినాలలో కూడా పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. సెలవులు ఇస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోవటం లేదు. మునిసిపల్ కార్మికులను ఆప్కాస్ లిమిటెండ్ కంపెనీ కార్మికులో లేక సచివాలయ కార్మికులో తేడా తెలియకుండా చే శారు. మునిసిపల్ కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ, టీఎన్‌టీయూసీ అనుబంధ సంఘాలతో పాటు అధికార పార్టీకి చెందిన వైఎ్‌సఆర్‌టీయూసీ అనుబంధ కార్మికుల సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి డిసెంబరు 27 నుంచి సమ్మెకు పిలుపునిచ్చాయి’’ అని రంగనాయకులు తెలిపారు.
Updated Date - 2023-12-11T01:11:29+05:30 IST