వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత
ABN, Publish Date - Dec 24 , 2023 | 03:44 AM
‘‘రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులను మార్చేస్తే తిరిగి అధికారం వస్తుందని సీఎం జగన్ భావిస్తే ఫలి తం చేదుగా ఉండవచ్చు. వైసీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత
అభ్యర్థులను మారిస్తే అధికారం వస్తుందని జగన్ అనుకుంటే ఫలితం చేదుగా ఉంటుంది: ఉండవల్లి
రాజమహేంద్రవరం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ‘‘రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులను మార్చేస్తే తిరిగి అధికారం వస్తుందని సీఎం జగన్ భావిస్తే ఫలి తం చేదుగా ఉండవచ్చు. వైసీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. వైఎస్ చనిపోయినపుడు సోనియా సీఎం పదవి ఇవ్వలేదని జగన్ ఎలా ఫీలయ్యాడో.. ఇవాళ జగన్ తిరిగి సీటు ఇవ్వకపోతే ఎమ్మెల్యేలు అలానే ఫీలవుతారు. అంతేకాదు కొన్ని ఓట్లు కూడా తీసుకొని పోతారు’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ హెచ్చరించారు. రాజమహేంద్రవరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సిటింగ్ ఎమ్మెల్యేల సీట్లు మార్చక కేసీఆర్, ఏపీలో సీట్లు మార్చి జగన్ ఓడిపోయారనే పరిస్థితిని తెచ్చుకోవద్దని హితవు పలికారు. అసలు ఎమ్మెల్యేలకు ప్రజల్లో పట్టు ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. ‘‘అంతా జగనే కదా.. ఆయన లేకపోతే వలంటీర్లదే పట్టు. వాళ్లనే నిలబెడితే పోతుందేమో’’ అని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ యువనేత లోకేశ్ యువగళం పాదయాత్ర బాగా జరిగిందని, జనసేనతో పొత్తు వారి బలాన్ని మరింత పెంచిందని తెలిపారు. కాగా, పార్లమెంట్ పొగబాంబు ఘటనలో నిందితులకు పాస్ ఇచ్చిన ఎంపీని కనీసం ప్రశ్నించకుండా ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని ఉండవల్లి అన్నారు.
Updated Date - Dec 24 , 2023 | 03:44 AM