బీచ్‌శాండ్ టెండర్లపై ప్రీ-బిడ్ మీటింగ్
ABN, Publish Date - Dec 22 , 2023 | 02:30 AM
బీచ్‌శాండ్ టెండర్లలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఇక్కడి ఏపీఎండీసీ కార్యాలయంలో బిడ్‌లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లతో గనుల శాఖ ప్రీ-బిడ్
సాంకేతిక, ఆర్థిక అంశాలపై సుదీర్ఘ చర్చ!
వెంకటరెడ్డి, అదానీ ప్రతినిధులు హాజరు!
బిడ్ దాఖలుకు నాలుగు వరకు గడువు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): బీచ్‌శాండ్ టెండర్లలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఇక్కడి ఏపీఎండీసీ కార్యాలయంలో బిడ్‌లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లతో గనుల శాఖ ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించింది. బీచ్‌శాండ్ టెండర్ డాక్యుమెంట్‌లో (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్-ఆర్‌ఎ్‌ఫపీ) ఉన్న సాంకేతిక, ఆర్థిక అంశాలపై కాంట్రాక్ట్ సంస్థలు, ఏజెన్సీలు లేవనెత్తిన అంశాలపై రెండున్నర గంటలపైనే చర్చ జరిగినట్లు తెలిసింది. ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి, టెండర్ నిర్వహణలో నోడల్ అధికారిగా ఉన్న రామ్ నారాయణన్, ఇతర అధికారులు పాల్గొన్నట్లు తెలిసింది. కాగా, అదానీ గ్రూప్‌నకు చెందిన అల్లువియల్ హెవీ మినరల్స్ లిమిటెడ్‌తోపాటు ఆరు కంపెనీల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారని సమాచారం. అయితే, ఈ సమావేశంలో కంపెనీల ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై ఈ నెల 26వ తేదీన సమాధానం ఇవ్వనున్నారు. వచ్చే నెల 4 వరకు బీచ్‌శాండ్ టెండర్లలో బిడ్‌లు దాఖలు చేయవచ్చు.
Updated Date - Dec 22 , 2023 | 02:30 AM