హమీల అమలులో వైసీపీ విఫలం
ABN, Publish Date - Dec 31 , 2023 | 10:53 PM
వైసీపీ పాలకులు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మా జీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నవరత్నాల పేరుతో ప్రజలను ఘోరంగా మోసం చేశారని విమర్శించారు. నిరంతరం అబద్ధాలు చెప్తూ కాలం గడుపుతున్నారని స్పష్టం చేశారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు.
దర్శి, డిసెంబరు 31 : వైసీపీ పాలకులు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మా జీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నవరత్నాల పేరుతో ప్రజలను ఘోరంగా మోసం చేశారని విమర్శించారు. నిరంతరం అబద్ధాలు చెప్తూ కాలం గడుపుతున్నారని స్పష్టం చేశారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. జగన్ ఇచ్చిన హమీలను విఫలమైన వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను ఆయన ప్రదర్శించారు. పాలనలో జగన్ విఫలమైన తీరును ప్రజలకు క్షు ణ్నంగా వివరించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చిట్టే వెంకటేశ్వర్లు, తెలుగు మహిళా నాయకురాలు ఎం.శోభారాణి, దర్శి పట్టణ క్లష్టర్ ఇన్‌చార్జి నారపుశెట్టి మధు, నాయకులు సంగా తిరుపతిరావు, పారా గాలయ్య, మారెళ్ల వెంకటేశ్వర్లు, కల్లూరి సుబ్బు, జూపల్లి కోటేశ్వరరావు, సైదారావు, దినకర్ పాల్గొన్నారు.
Updated Date - Dec 31 , 2023 | 10:53 PM