ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం

ABN, First Publish Date - 2023-12-10T22:09:06+05:30

కనిగిరి ప్రాంతంలోని యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ధ్యేయమని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. మున్సిపాల్టీ పరిధిలోని 9వ వార్డు బోయపాలెంలో ఆదివారం బాబు ష్యూరిటీ..భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా డాక్టర్‌ ఉగ్ర ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. పాలెంలోని ప్రతి ఇంటికీ వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించారు. టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యను ఉగ్ర వివరించారు.

మహిళా పథకాలను వివరిస్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి, డిసెంబరు 10 : కనిగిరి ప్రాంతంలోని యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ధ్యేయమని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. మున్సిపాల్టీ పరిధిలోని 9వ వార్డు బోయపాలెంలో ఆదివారం బాబు ష్యూరిటీ..భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా డాక్టర్‌ ఉగ్ర ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. పాలెంలోని ప్రతి ఇంటికీ వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించారు. టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యను ఉగ్ర వివరించారు. మహిళలు కనిగిరి ప్రాంతంలో ఉపాధి లేక తమ కుటుంబీకులు పరాయి ప్రాంతాల్లో పనులకు వలస వెళ్తున్నారని తెలిపారు. తాగేందుకు మంచినీరు కూడా లేకుండా పోయిందని ఆవేదన వెలిబుచ్చారు. తాము కూలి చేసుకుని సంపాదించుకున్నది పెరిగిన ధరలకు, వైద్యానికే ఖర్చు అయిపోతుందని వాపోయారు. ఉగ్ర మాట్లాడుతూ కనిగిరి పట్టణంలోని ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయిలు పెట్టించి సాగర్‌ నీటిని సరఫరా చేయించే బాధ్యత తనముందున్న ప్రధాన కర్తవ్యంగా చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని నాయకులు ఇప్పుడు ఓట్లు కోసం మళ్లీ కల్లబొల్లి మాటలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారన్నారు. వైసీపీ పాలకులు, నేతలు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదో నిలదీయాలని ఉగ్ర సూచించారు. మీ వెంట ఉండి, మీ కోసం పనిచేసే నాయకుడినే ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాల్టీలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పించి అబివృద్ధి చేస్తానన్నారు. తాను గెలిచాక హామీలను నెరవేర్చకపోతే నిలదీయాలని అన్నారు. పరాయి ప్రాంతానికి చెందిన వ్యక్తులకు, ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులు పాలిస్తే జరిగిన అభివృద్ధిని మీరే చూశారని, ఇప్పటికై నా వచ్చే ఎన్నికల్లో ఆలోచించి టీడీపీని గెలిపిం చుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలన్నారు. బో యపాలెంలో ప్రచారానికి వెళ్లిన డాక్టర్‌ ఉగ్రకు ప్రజలనుంచి అ పూర్వ స్వాగతం లభించిం ది. మహిళలు పెద్ద ఎ త్తున ఎదురెళ్లి హారతులిచ్చారు. ప్రతి ఇంటి వద్దా ఆయనకు ఆప్యాయంగా పలుకరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, తెలుగు మ హిళలు పాల్గొన్నారు.

హనుమంతునిపాడులో..

పేద వర్గాల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని మండల అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి అన్నారు. నందనవనం గ్రామంలో ఆదివారం బాబు ష్యూరిటీ కార్యక్రమంలో భాగం గా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలుపించుకోవాలని ప్రజలను కోరారు. వైసీపీ పాలకులు నిర్లక్ష్యం కారణంగా కనిగిరి ప్రాంతంతో పాటు హనుమంతునిపాడు మండలం అన్ని విధాలుగా వెనుకబాటుకు గురైందన్నారు. డాక్టర్‌ ఉగ్రను గెలిపించుకొని మండలాన్ని బాగుచేసుకుందామన్నారు. కార్యక్రమంలో నాయకులు, బూత్‌ ఇన్‌చార్జిలు అనంతలక్ష్మి, కొండమ్మ, నారాయణమ్మ, పార్వతి, లక్ష్మీ, షేక్‌ కాశమ్మ, శ్రీనివాసులు, కుల్లూరి శ్రీనివాసులు, సత్యనారాయణ, రంగయ్య, సుబ్బరాయుడు, చిన సుబ్బరాయుడు, ఆదినారయణ, మువ్వారంగసాయి, గరిగ బ్రహ్మనాయుడు, జనసేన పార్టీ నాయకులు వెంకట్రావు పాల్గొన్నారు.

టీడీపీతోనే అన్నివర్గాల సంక్షేమం

పామూరు, డిసెంబరు 10 : టీడీపీతోనే అ న్నివర్గాల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టీడీపీ బూత్‌ కమిటీ ఇన్‌చార్జి బత్తుల నాగేశ్వరరావు అన్నారు. పట్టణంలోని వడ్డెపాలెం బూ త్‌ నెంబర్‌ 276లో బాబు ష్యూరిటీ..భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి రాగానే అ మలు చేసే 6 పథకాలపై అవగాహన కల్పించారు. ఐదేళ్లుగా జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్ర అభివృద్ధి నాశనమైందన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలపై వైసీపీ ప్రభుత్వం భారాలు మోపిందన్నారు. వారి పాలనలో అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆనంద ఆంధ్రప్రదేశ్‌ కోసం చంద్రబాబును ముఖ్యమంత్రిగా, కనిగిరి ప్రాంత అభివృద్ధి కో సం డాక్టర్‌ ఉగ్రను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T22:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising