ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్‌

ABN, Publish Date - Dec 14 , 2023 | 10:33 PM

వైసీపీ పాలనలో న్విర్వీర్యమైన రాష్ట్ర భవిష్యత్‌ చంద్రబాబుతోనే సాధ్య మని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. పువ్వాడి కల్యాణ మండపంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులతో నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం పార్టీ మండలాధ్యక్షు డు పు వ్వాడి వెంకటేశ్వర్లు అధ్యక్షతన గురువారం జరిగింది.

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

తొలిగెలుపు కనిగిరి నుంచే ప్రారంభం కావాలి

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

పామూరు, డిసెంబరు 14 : వైసీపీ పాలనలో న్విర్వీర్యమైన రాష్ట్ర భవిష్యత్‌ చంద్రబాబుతోనే సాధ్య మని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. పువ్వాడి కల్యాణ మండపంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులతో నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం పార్టీ మండలాధ్యక్షు డు పు వ్వాడి వెంకటేశ్వర్లు అధ్యక్షతన గురువారం జరిగింది. ముఖ్యఅతిథిగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ వైసీపీ పాలకులు అధికారం ముసుగులో సహజవనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో అవినీతి, అ క్రమాలు, అరాచకాలు, దాడులతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే వారిని అరెస్టులతో వేధిస్తున్నార న్నారు. నియంత పాలకులను గద్దె దింపాలన్న లక్ష్యంతో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ టీడీపీ తో కలిసి వెళ్లేందుకు ముందుకొచ్చారన్నారు. టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో గెలుపునకు శ్రమించాలని ఉగ్ర వి జ్ఞప్తి చేశారు. అధికారం కోసం తాను ఎన్నడూ ఆలోచించలేదన్నారు. ప్రజా సేవకుడిగా ఉండాలన్నదే ధ్యేయమన్నారు. పదేళ్లుగా అధికారం లేకపోయినా ఉచిత కంటి వైద్య శిబిరాలు, అన్న క్యాంటీన్‌ ద్వారా పేదలకు ఉచిత భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ తొలి గెలుపు కనిగిరి నుంచే మొదలయ్యేలా శ్రేణులు శ్రమించాలన్నారు. టీడీపీ రాష్ట్ర ముస్లిం సెల్‌ నాయకులు రోషన్‌ సంధాని మాట్లాడుతూ ట్రిపుల్‌ ఐటీ, నిమ్జ్‌, సమ్మర్‌ స్టోరేజీ, రైల్వేలైన్‌, వెలిగొండ ప్రాజెక్టు సాధించే సత్తా ఉగ్రకే ఉందన్నారు. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వై రహీముల్లా మాట్లాడుతూ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ కా ర్యకర్తలు కలిసికట్టుగా పని చేసి ఉగ్రను గెలిపించుకోవాలన్నారు. సమా వే శంలో ఒంగోలు పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షుడు ఏలూరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ నాయుకలు అడుసుమల్లి ప్రబాకర్‌చౌదరి, కనిగిరి, వెలిగండ్ల, సీ ఎస్‌పురం, హెచ్‌ఎంపాడు, పీసీపల్లి మండలాల అధ్యక్షులు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 10:33 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising