కనిగిరి నుంచే టీడీపీ శంఖారావం
ABN, Publish Date - Dec 30 , 2023 | 12:46 AM
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కనిగిరిలో జరగబోయే చంద్రబాబు శంఖారావం సభ నాంది కానుందని ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజీ చెప్పారు.
విజయానికి ఇదే నాంది
ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని
చంద్రబాబు సభ కోసం డాక్టర్ ఉగ్ర భారీ ఏర్పాట్లు
కనిగిరి, డిసెంబరు 29 : వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కనిగిరిలో జరగబోయే చంద్రబాబు శంఖారావం సభ నాంది కానుందని ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజీ చెప్పారు. వచ్చే నెల 5న కనిగిరిలో చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాటు కోసం స్థల పరిశీలనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల శంఖారావం సభ కనిగిరి నుంచి ప్రారంభం కావడం శుభపరిణామమన్నారు. టీడీపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి జగన్‌కు ముచ్చెమటలు పడుతున్నాయని చెప్పారు. అందుకే ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా వారిని మరో నియోజకవర్గానికి బదిలీ చేస్తున్నాడన్నారు. ప్రస్తుత నియోజకవర్గంలో విపరీతమైన ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న వ్యక్తికి మరో చోట ఎలా ప్రజాదరణ ఉంటుందని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా ఘోర పరాజయం తప్పదన్నారు. చంద్రబాబు శంఖారావం సభకు దాదాపు 2లక్షల మంది ప్రజలు రానున్నారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆయన వెంట కనిగిరి, వై.పాలెం ఇన్‌చార్జిలు డాక్టర్ ఉగ్ర, ఎరిక్షన్‌బాబు ఉన్నారు.
చంద్రబాబు సభకు డాక్టర్ ఉగ్ర భారీ ఏర్పాట్లు
కనిగిరిలో చంద్రబాబు నిర్వహించే సభకు డాక్టర్ ఉగ్ర భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కనిగిరి- సీఎ్‌సపురం, కనిగిరి-పామూరు రోడ్డులోని రెండుచోట్ల సభాస్థలి కోసం ప్రాంగణాలను పరిశీలించారు. అందులో కనిగిరి-సీఎస్‌పురం రోడ్డులోని చాకిరాల వద్ద ఉన్న స్థలం సభకు అనువైనదిగా డాక్టర్ ఉగ్ర గుర్తించారు. అక్కడ దాదాపు 2లక్షల మంది సభకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌తోపాటు భోజనవసతికి డాక్టర్ ఉగ్ర ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Updated Date - Dec 30 , 2023 | 12:46 AM