ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సిట్టింగ్‌లకు షాక్‌!

ABN, Publish Date - Dec 14 , 2023 | 01:38 AM

ఓటమి భయంతో వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల విషయంలో మార్పులు,చేర్పులకు శ్రీకారం పలికిన వైసీపీ.. జిల్లాలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా తొలగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

మరో ముగ్గురు ఎమ్మెల్యేల మార్పు?

గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల్లో రెడ్డి సామాజికవర్గానికి అవకాశం

కనిగిరికి నెల్లూరు జిల్లా నాయకుడు దిగుమతి

అద్దంకిలో హనిమిరెడ్డి బ్రదర్స్‌కు స్పందించని కేడర్‌

ఓటమి భయంతో వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల విషయంలో మార్పులు,చేర్పులకు శ్రీకారం పలికిన వైసీపీ.. జిల్లాలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా తొలగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తొలివిడత రాష్ట్రంలోని 11 నియోజకవర్గాల్లో, అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నాలుగుచోట్ల అభ్యర్థులను మార్చిన ఆ పార్టీ అధిష్ఠానం మరో జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. ఆప్రకారం జిల్లాలోని దర్శితోపాటు కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణుగోపాల్‌, బుర్రా మధుసూదన్‌యాదవ్‌, అన్నా రాంబాబులను కూడా మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే వారికి మరోచోట అవకాశం ఇస్తారా? లేక పూర్తిగా పక్కన పెడతారా? అన్న విషయంలో ఇంకా తుది నిర్ణయానికి రాలేదని సమాచారం. కాగా ‘పక్క జిల్లాలో చెల్లని కాసులు ఇక్కడ చెల్లుతాయా’ అని ఆ పార్టీ కేడర్‌ మాట్లాడుకోవడం గమనార్హం.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జుల్లో కొందరిని పోటీ నుంచి తప్పించడం లేక వేరే నియోజకవర్గాలకు మార్చడం ఖాయమైంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు, ఇతరత్రా సరికొత్త వ్యూహాల్లో భాగంగా పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు ఆపార్టీ చెక్‌పెడుతోంది. ఇప్పటికే తొలి జాబితాలో మంత్రి సురేష్‌ను కొండపి నియోజకవర్గానికి మార్చింది. సంతనూతలపాడు ఎమ్మెల్యేపై వేటు వేసింది. అద్దంకి ఇన్‌చార్జిగా కొత్త నేతను నియమించింది. రెండో విడత జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్‌ను పక్కనపెట్టి అక్కడ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని రంగంలోకి తేవాలన్న నిర్ణయం జరిగిపోయింది. అయితే సీఎం జగన్‌ను కలవడంలో వేణుగోపాల్‌ జాప్యం చేయటంతో ఆ మార్పు ప్రకటన తొలి జాబితాలో చోటుచేసుకోలేదు.

గిద్దలూరులో మార్పు ఖాయమే..

గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును తప్పించే ఆలోచనను సీఎం జగన్‌ చేస్తున్నట్లు సమాచారం. వైసీపీలోని కొందరు ముఖ్యనాయకుల సమాచారాన్ని బట్టి గిద్దలూరు నుంచి రాంబాబుస్థానే రెడ్డి సామాజికవర్గం నాయకుడిని రంగంలో దించాలని అధిష్ఠానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారిలో ముగ్గురు, నలుగురు రెడ్డి సామాజికవర్గం నాయకులు ఉన్నారు. వారికి తోడు ఒక డాక్టర్‌ పేరు కూడా అధిష్ఠానం పరిశీలించిన విషయం తెలిసిందే. రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలన్న నిర్ణయంతోపాటు ఎన్నికల వ్యయం కూడా వారు సూచించిన స్థాయిలో చేయగలిగిన వారిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గిద్దలూరుతోపాటు దర్శిలో కూడా రెడ్డి సామాజికవర్గం వారిని పోటీకి దించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

బుర్రా పరిస్థితేమిటో?

కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ను కూడా తప్పించాలన్న నిర్ణయానికి ఆపార్టీ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ బీసీ సామాజికవర్గ అభ్యర్థికే అవకాశం ఇవ్వాలన్న భావనతో ఉన్నట్లు సమాచారం. అందుకోసం నెల్లూరు జిల్లాకు చెందిన ఒక నాయకుడిని కనిగిరి నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనతో సీఎం ఉన్నారని అంటున్నారు. అందుకు అనుగుణంగా ఒకటి రెండు పేర్లు చెప్పి పరిశీలన చేయాలని సీఎం జగన్‌ కొందరు నాయకులను ఆదేశించిట్లు తెలిసింది. అంతేకాక కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లో పార్టీ తాజా ఆలోచనకు అనుగుణంగా శ్రేణుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఐప్యాక్‌ ప్రతినిధులతో తక్షణ సర్వే కూడా చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

వారం తర్వాత నిర్ణయం

కనిగిరి, గిద్దలూరు, దర్శి ఎమ్మెల్యే లకు వేరే ఎక్కడైనా నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశం ఇవ్వాలా? లేక భవిష్యత్తులో ఇతరత్రా అవకాశాలు కల్పించాలా? అన్న విషయంలో అధి ష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయం మాత్రం ఇంకా వెల్లడికావడం లేదు. అతిత్వరలో వీరిని కూడా పిలిచి సీఎం జగన్‌ మాట్లాడేటప్పుడు ఆ విషయం చెప్పవచ్చని అంటున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు ఇటీవల మెడ నరాలకు సంబంధించి శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. అందువలన గిద్దలూరు విషయంతో మరికొంత సమయం తీసుకొని వారం రోజుల తర్వాత వెల్లడయ్యే జాబితాలో అధిష్ఠానం తమ నిర్ణయాన్ని ప్రకటించవచ్చని భావిస్తున్నారు.

అద్దంకిలో ముఖంచాటేసిన ముఖ్య నాయకులు

వైసీపీ అద్దంకి ఇన్‌చార్జిగా నియమితులైన హనిమిరెడ్డి సమీప బంధువులు ఇద్దరు బుధవారం అద్దంకి వచ్చారు. వారు ఆయ నకు సోదరులు అంటున్నారు. వారిరువురూ ఆర్‌ అండ్‌బీ అతిఽథిగృహంలో తిష్ఠవేసి నియోజకవర్గం లోని నాయకులకు ఫోన్‌చేసి వచ్చి కలవాలని కోరారు. అయితే ముఖ్య నాయకులు వారిని కలిసేందుకు వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది. ఫోన్‌లో సమాచారం అందుకున్న వారిలో 90శాతం మంది నాయకులు వెళ్లి వారిని కలవలేదు. అద్దంకి వైసీపీ పరిరక్షణ సమితి పేరుతో కొంతకాలంగా తిరుగుతున్న ముగ్గురు, నలుగురు నాయకులు మాత్రం హనిమిరెడ్డి పట్ల చురుగ్గా పనిచేస్తున్నారు. బుధవారం హనిమిరెడ్డి అనుయాయులను అద్దంకిలో కలిసిన వారిలో కేవలం ఒక సామాజికవర్గానికి చెందిన కొందరు మాత్రమే ఉన్నారు. అలా కలిసిన వారికి హనిమిరెడ్డి ఆదివారం నియోజకవర్గానికి వస్తారని ఆ సందర్భంగా భారీస్వాగతం పలకాలని వారు సూచించినట్లు తెలిసింది. మరోవైపు హనిమిరెడ్డి బుధవారం హైదరాబాద్‌లో వైవీ సుబ్బారెడ్డి కుమారుడితోపా టు సోదరుడు భద్రారెడ్డితో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన మోకాలు శస్త్రచికిత్సతో విశ్రాంతి తీసుకుంటున్న చీరాల వైసీపీ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌ను కలిశారు. అయితే నియో జకవర్గంలో పట్టు ఉన్న మాజీ ఎమ్మెల్యే గరట య్యను కానీ, ఇప్పటివరకు ఇన్‌చార్జిగా ఉన్న ఆయన కుమారుడు కృష్ణచైతన్యను కానీ కలవక పోగా కనీసం ఫోన్‌ కూడా చేయలేదని తెలుస్తోం ది. దీంతో కృష్ణచైతన్య సూచనకు అనుగుణంగానే ముందుకుపోవాలని భావిస్తున్న నాయకులు హనిమిరెడ్డి మనుషులు ఎంతగా పిలిచినా కలిసేందుకు ససేమిరా అన్నట్లుగా తెలిసింది.

Updated Date - Dec 14 , 2023 | 01:38 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising