ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కట్టుకున్న వాడే కడతేర్చాడు!

ABN, Publish Date - Dec 18 , 2023 | 10:44 PM

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కర్కోటకుడిగా మారాడు. ఆమె మెడపై కత్తితో నరికి దారుణంగా అంతమొందించాడు. ఈ సంఘటన టంగుటూరులోని పోతుల చెంచయ్య వెస్ట్‌కాలనీలో సోమవారం చోటుచేసుకుంది.

సంతోషమ్మ మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ రంగనాధ్‌

అనుమానంతో భార్యను కత్తితో నరికి చంపిన భర్త

టంగుటూరు, డిసెంబరు 18 : భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కర్కోటకుడిగా మారాడు. ఆమె మెడపై కత్తితో నరికి దారుణంగా అంతమొందించాడు. ఈ సంఘటన టంగుటూరులోని పోతుల చెంచయ్య వెస్ట్‌కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని చెన్నాయపాలెంనకు చెందిన పామంచి బాబుకు బాపట్ల జిల్లా చినగంజాంకు చెందిన సంతోషమ్మ(31)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 9, 7 సంవత్సరాల ఇద్దరు కుమారులున్నారు. కొంతకాలం నుంచి సంతోషమ్మపై బాబు అనుమానం పెంచుకున్నాడు. దీంతో కాపురంలో చిచ్చుమొదలైంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో సంతోషమ్మ పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం బాబు ఆమె వద్దకు వెళ్లి సర్దిచెప్పి చెన్నాయపాలెం తీసుకువెళ్లాడు. ఆ తర్వాత ఆ గ్రామం కాదని ఆ దంపతులిద్దరూ పిల్లలతో కలిసి టంగుటూరు వచ్చి పోతుల చెంచయ్యవెస్ట్‌ కాలనీలో కాపురం పెట్టారు. ఆరు నెలలుగా ఇక్కడే ఉంటున్నారు. బాబు రామాయపట్నం కేంద్రంగా పెద్దపెద్ద షిప్పుల్లో ఇతర మత్స్యకారులతో కలసి చేపలవేటకు వెళ్తుండగా, సంతోషమ్మ రొయ్యల ఫ్యాక్టరీలో పనికివెళ్తూ జీవనం సాగిస్తున్నారు. అయిప్పటికీ బాబుకు భార్యపై అనుమానం పోలేదు. తరచూ ఇద్దరూ గొడవపడుతూనే ఉన్నారు. సోమవారం కూడా వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సంతోషమ్మను హతమార్చాలని బాబు నిర్ణయించుకున్నాడు. ఆమె ఇంట్లో టీవీ చూస్తూ చిక్కుడు కాయలు వలుస్తుండగా ఒక్కసారిగా సౌండ్‌ పెంచాడు. ఆ వెంటనే కత్తి తీసుకొని సంతోషమ్మ మెడపై బలమైన వేటు వేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని బాత్రూంలోకి లాగి తలుపు దగ్గరకు వేసి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కాలనీలో నివాసం ఉండే బంధువులకు ఫోన్‌చేసి జరిగిన విషయం చెప్పాడు. వారు పరుగున బాబు ఇంటికి వెళ్లి పరిశీలించగా బాత్‌ రూంలో రక్తపు మడుగులో సంతోషమ్మ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మృతదేహాన్ని పరిశీలించిన సీఐ

సమాచారం అందుకున్న సింగరాయకొండ సీఐ రంగనాథ్‌, టంగుటూరు ఎస్సై ఖాదర్‌బాషాతో కలసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంతోషమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. సీఐ వెంటనే సింగరాయకొండ ఎస్సై శ్రీరాం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారు హంతకుడి కోసం వెతుకులాట ప్రారంభించారు.

Updated Date - Dec 18 , 2023 | 10:44 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising