ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విశ్రాంత ఉద్యోగులు సంఘటితంగా ఉండాలి

ABN, Publish Date - Dec 18 , 2023 | 01:36 AM

విశ్రాంత ఉద్యోగులు సంఘటితంగా ఉన్నప్పుడే ప్రభు త్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలను పరిష్కరిం చుకోవచ్చని, ఆ సంఘం తాలూకా యూనిట్‌ అధ్యక్షులు డి .బాదరయ్య అన్నారు.

ఎర్రగొండపాలెం,డిసెంబరు 17 : విశ్రాంత ఉద్యోగులు సంఘటితంగా ఉన్నప్పుడే ప్రభు త్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలను పరిష్కరిం చుకోవచ్చని, ఆ సంఘం తాలూకా యూనిట్‌ అధ్యక్షులు డి .బాదరయ్య అన్నారు. ఎర్రగొండపాలెంలో ఆదివారం జరిగిన పెన్షనర్ల దినోత్సవం నిర్వహించారు. విశ్రాంత ఉద్యోగులు ఏమైనా సమస్యలు ఉంటే యూనిన్‌ కార్యాలయానికి వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం కార్యదర్శి టీవీఎల్‌ సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు టి.సుబ్బారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కూచిపూడి కోటయ్య, కోశాధికారి అమీనా సాహెబ్‌, కార్యవర్గసభ్యులు పుచ్చనూతల లక్ష్మినారాయణ, వెంకటేశ్వరరెడ్డి, యోగేశ్వరరావు, ఎంఐ.ప్రసాదు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం సీనియర్‌ విశ్రాంత ఉద్యోగులను యూనియన్‌ నాయకులు సన్మానించారు.

కంభం : విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని కంభం సబ్‌ట్రెజరీ ఆఫీసర్‌ కేవీ.రవికుమార్‌ తెలిపారు. ఆదివారం పింఛనర్ల దినోత్సవాన్ని పురష్కరించుకొని సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థికంగా ఒత్తిడి, ఆందోళన లేకుండా కుటుంబసభ్యులతో సంతోషంగా జీవించాలన్నారు. కార్యక్రమంలో ఫించనర్ల సంఘం అధ్యక్షులు మీనిగ ప్రసాద్‌, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి కే.వెంకటరావు, విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పగడాల పాండు, ట్రెజరర్‌ ఎస్‌.ఏ.కలామ్‌, మీనిగ రామారావు తదితరులు పాల్గొన్నారు. 70 సంవత్సరాల పైబడిన పింఛనర్లను సన్మానించారు.

పొదిలి : జాతీయ పెన్షనర్ల దినోత్స వాన్ని ఆ సంఘం అధ్యక్షుడు ఏ బాదుల్లా అధ్యక్షతన ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపఖజానా అధికారి చంద్ర శేఖర్‌ హాజరై మాట్లాడారు. పెన్షనర్ల సంఘ వ్యస్థాపకుడు డీఎస్‌ నకరా పోరాడి హక్కులను సాధించారన్నారు. ఆయన్ను స్మరించుకుంటూ ఏటా డిసెంబరు 17న పెన్షనర్ల దినోత్సవాన్ని నిర్వహించు కోవడం ఆనవాయితీగా వస్తోంద న్నారు. మర్రిపూడి ఎంపీపీ వాకా వెంకటరెడ్డి మాట్లాడుతూ పెన్షనర్ల సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ముఖ్య అతిథు లను దాతలకు 75 ఏళ్లు పైబడిన పెన్షనర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఒంగోలు ఎస్టీవో, ఎపీఎస్‌ఎస్‌ ప్రసాదు, సంఘ నాయకులు ఏ.వీరారెడ్డి, మదార్‌వలి, డీఎల్‌ నరసింహారావు, దానమ్మ, సుబ్బారావు, మోహన్‌రావు, యలమందారెడ్డి, లక్ష్మయ్య, పీడీసీసీ మేనేజర్‌ సునీల్‌గుప్తా, మార్కాపురం డీపీఎల్‌వో నాగేశ్వరరావు, మాకినేని రమణయ్య, పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి మండలాల పెన్షన్‌దారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 01:36 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising